
అయితే ఈ సినిమా పూర్తయ్యాక జాన్వి కపూర్ మరిన్ని తెలుగు ప్రాజెక్ట్స్ చేయబోతుందా? అనే ప్రశ్న అభిమానుల్లో చాలా రోజులుగా ఉంది. ఇప్పటివరకు జాన్వి తెలుగు సినిమాల్లో మరొక ప్రాజెక్ట్‌కి కమిట్ కాలేదు. కానీ ఇటీవల ఒక భారీ తెలుగు పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లో ఆమెకు ఆఫర్ వచ్చినట్లు టాక్. ఆ సినిమాలో నటించాల్సిన స్టార్స్ జాన్వి కపూర్‌నే హీరోయిన్‌గా కావాలనుకున్నాడని వార్తలు వచ్చాయి. అయితే ఆ స్టార్ హీరో, జాన్వి గతంలో చేసిన సినిమాల ఫలితాలను చూసి, “ఇంకా సమయం ఉంది, తర్వాత చూద్దాం” అంటూ ఆమె ఆఫర్‌ను వదిలేశాడన్న గాసిప్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ వార్తలతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. “జాన్వి పేరు చెప్పగానే హీరోలు కూడా వెనకడుగు వేస్తున్నారు” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ జాన్వి అభిమానులు మాత్రం దీనిపై మండిపడుతున్నారు. “సినిమా హిట్ అవ్వడం లేదా ఫ్లాప్ అవ్వడం కేవలం హీరోయిన్ వల్లే జరుగుతుందా? ఒక సినిమా విజయం మొత్తం టీమ్ వర్క్ మీద ఆధారపడి ఉంటుంది. హీరోయిన్‌ను టార్గెట్ చేయడం పూర్తిగా అన్యాయం” అంటూ సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. అంతేకాదు, ట్రోల్స్ చేసిన కామెంట్స్‌కు సమాధానంగా అభిమానులు ఆ హీరో గత ట్రాక్ రికార్డ్‌ను కూడా బయట పెడుతున్నారు. గతంలో అతడు కూడా వరుస ఫ్లాప్‌లను ఎదుర్కొన్నాడని గుర్తు చేస్తున్నారు. దీనితో ఇప్పుడు జాన్వి కపూర్ పేరు, ఆ స్టార్ హీరో పేరు కలిసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయాయి.
మొత్తం మీద జాన్వి కపూర్ క్రేజ్, గ్లామర్, యాక్టింగ్ స్కిల్స్ వల్ల టాలీవుడ్‌లో ఇంకా భారీ ఆఫర్లు రాబడే అవకాశం ఉంది. వరుస ఫ్లాప్‌లు వచ్చినా ఆమె స్టార్ ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదని చెప్పాలి. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వస్తున్న ‘పెద్దిద్ద’ సినిమాతో ఆమె టాలీవుడ్‌లో తన స్థాయిని మరోసారి నిరూపించుకుంటుందా..? అన్నది చూడాలి..!!