
దీంతో వైసీపీ హయాంలో చేపట్టిన మూడు రాజధానులు ముందుకు సాగలేదు. పంచాయతీ కార్యాలయా లపై పార్టీ రంగులు వేసినా.. కూడా సమర్థించుకోలేక పోయారు. ఇక, డాక్టర్ సుధాకర్ విషయంలోనూ.. కోర్టులో పేలవమైన వాదనలు వినిపించారు. అనంతబాబు విషయంలోనూ ఇదే జరిగింది. అవి తప్పులే కావొచ్చు. కానీ, తమ పక్షాన బలమైన వాదనలు వినిపించాలి కదా! అనేది మాజీ ఎమ్మెల్యే కేతి రెడ్డివంటి వారు చెప్పే మాట. ఇక, ఇప్పుడు కూడా అలానే ఉంది.
లీగల్ సెల్‌లో చాలా మంది నాయకులు ఉన్నారు. వైసీపీ తరఫున ఎవరు అరెస్టయినా.. స్పందిస్తున్నారు. కానీ, వారు కోర్టుల్లో బలమైన వాదనలు అయితే వినిపించలేక పోతున్నారన్నది పార్టీలోనూ కొన్నాళ్లుగా జరుగుతున్న చర్చే. అందుకే.. చాలా మంది నాయకులు జైళ్లకు వెళ్లాక.. సొంతగా లాయర్లను పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో లీగల్ సెల్‌పై నమ్మకం లేకపోవడంతోనే వారు అలా చేస్తున్నారన్న చర్చ ఉంది. మరోవైపు. టీడీపీని చూస్తే.. బలమైన లీగల్ సెల్ ఉంది.
చిన్న కోర్టుల నుంచి పెద్ద కోర్టుల వరకు కూడా.. టీడీపీలో బలమైన వాదనలు వినిపించేవారు ఉన్నారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు, మూడు రాజధానుల విషయంతెరమీదికి వచ్చిన తర్వాత వారు బలంగా వాదనలు వినిపించారు. అంతేకాదు.. ఒక్క కొమ్మినేని మినహా.. ఇతర కేసుల్లోనూ బలమైన సెక్షన్లతో వాదనలు వినిపించారు. దీంతో టీడీపీ పట్టు పెంచుకునే అవకాశం వచ్చింది. దీనిని ఉదాహరణగా చూపిస్తున్న వైసీపీనాయకులు.. తమకు కూడా లీగల్ సెల్ అలానే ఉండాలని కోరుతున్నారు. కానీ, ఇది ఖర్చుతో కూడిన వ్యవహారం కావడం.. ప్రస్తుత లీగల్ సెల్‌లో ఎక్కువ మంది రెడ్లు ఉండడంతో సాధ్యం కావడం లేదని తెలుస్తోంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు