
నియోజకవర్గాల పునర్విభజనకు లైన్ క్లీయర్ అవుతుందన్న చర్చలు వినిపిస్తున్నాయి. ఏపీలో ప్రస్తుతం ఉన్న 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు అదనంగా మరో 50 నియోజకవర్గాలు కలిసి మొత్తం 225 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పడనున్నాయి. ఈ క్రమంలోనే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మరో మూడు కొత్త నియోజకవర్గాలు రావొచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతంలో ఉమ్మడి పశ్చిమలో ఉన్న పెనుగొండ - అత్తిలి రెండు నియోజకవర్గాలు రద్దయ్యాయి. వీటి స్థానంలో నిడదవోలు కొత్తగా వచ్చి చేరింది. ఇక ఇప్పుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి మార్పు చెందింది. ఏలూరు - పశ్చిమ గోదావరి జిల్లాలు గా మారింది. జిల్లాలోని గోపాలపురం - కొవ్వూరు - నిడదవోలు నియోజకవర్గాలు తూర్పు గోదావరిలో కలిశాయి. కృష్ణా జిల్లా నుంచి కైకలూరు - నూజివీడు నియోజకవర్గాలు ఏలూరు జిల్లాలో కలిశాయి.
ఇక ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభన జరిగితే ఏలూరు జిల్లాలో కొత్తగా రెవెన్యూ డివిజన్ జంగారెడ్డి గూడెం కేంద్రంగా కొత్త జనరల్ నియోజకవర్గం ఏర్పాటు కానుందని తెలుస్తోంది. రెవెన్యూ డివిజన్ - పోలీస్ సబ్ డివిజన్ తో పాటు మున్సిపాల్టీ గా జంగారెడ్డిగూడెం ఉంది. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో రద్దయిన అత్తిలి - పెనుగొండ స్థానాల్లో ఏదో ఒక నియోజకవర్గం కొత్తగా వస్తుందా ? లేదా ? భీమవరం రూరల్ లేదా వీరవాసరం పేరుతో మరో నియోజకవర్గం వస్తుందా ? తెలియదు కాని... మరో నియోజకవర్గం ఈ జిల్లాలో ఏర్పాటు కానుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు