
రాజకీయ వైరాలకు దూరం:
ప్రస్తుతం రాజకీయాల్లో ప్రత్యర్థులపై ద్వేషం పెంచుకోవడం, ఘర్షణలు సృష్టించడం సహజంగా మారిపోయింది. కానీ చంద్రబాబు తాను ఎప్పుడూ ప్రత్యర్థులను శత్రువులుగా చూడలేదనే విషయం ప్రత్యేకంగా గుర్తించాలి. వైఎస్ రాజశేఖర్ రెడ్డితో తీవ్ర రాజకీయ విభేదాలు ఉన్నా అభివృద్ధి కార్యక్రమాల్లో కలిసి పనిచేశారు. హైటెక్ సిటీ వంటి ప్రాజెక్టుల సమయంలో ఇద్దరూ కలసి ముందుకు సాగారు. ఇది నేటి తరానికి పెద్ద పాఠం.
సంపద సృష్టి :
రాజకీయాల్లో డబ్బు అవసరమనే విషయాన్ని చంద్రబాబు ఎప్పుడూ స్పష్టంగా చెప్పారు. కానీ ఆ సంపాదన పారదర్శకంగా, అందరికి మెప్పించేలా ఉండాలని ఆయన నమ్మకం. తొలినాళ్లలో పెద్దల విరాళాలు, ఆపై వ్యాపారాల ద్వారా వచ్చిన ఆదాయంతో రాజకీయాలకు నిధులు సమకూర్చుకున్నారు. ఆయన సతీమణి భువనేశ్వరి కూడా ఎన్నోసార్లు దీన్ని స్పష్టం చేశారు. ఇన్నేళ్లలో మిగిలిన రాజకీయ నేతలతో పోల్చుకుంటే చంద్రబాబుపై పెద్ద అవినీతి ఆరోపణలు రాలేదు. ఇది నేటి తరం నేర్చుకోవాలి.
ప్రజలతో మమేకం:
చాలా మంది నాయకులు ఎన్నికల సమయంలోనే ప్రజలను గుర్తిస్తారు. కానీ చంద్రబాబు మాత్రం అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలతో ఎప్పుడూ మమేకమై ఉంటారు. కరోనా సమయంలో జూమ్ మీటింగ్స్ ద్వారా ప్రజలకు వైద్య నిపుణుల సలహాలు అందించడం, ప్రతి సమస్యలో ప్రజల వెంటే ఉండడం ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. మొత్తానికి చంద్రబాబు నాయుడు ఒక రాజకీయ నేతగా మాత్రమే కాకుండా, ఒక గురువుగా కూడా ఈ తరం నేతలకు నిలుస్తున్నారు అనడంలో సందేహం లేదు.