ఈ స్థాయి పెట్టుబడులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి పోస్తాయన్నది నిపుణుల అంచనా.అతిపెద్ద ఒప్పందం బ్రుక్‌ఫీల్డ్ యాక్సిస్ వెంచర్స్ కూటమి నుంచి వచ్చింది. ఏభై ఏడు వేల కోట్ల రూపాయలతో రంగంలోకి దిగుతున్న ఈ సంస్థ పునరుత్పాదక ఇంధన రంగంలో భారీ విస్తరణ చేపట్టనుంది. అదే సమయంలో విన్ గ్రూప్ ఇరవై ఏడు వేల కోట్లు, ఈవ్‌రెన్ యాక్సిస్ ఎనర్జీ ముప్పై ఒకటి వేల ఐదు వందల కోట్లతో సౌర, గాలి విద్యుత్ ప్రాజెక్టులు ప్రారంభించనున్నాయి.
మేఘా ఇంజనీరింగ్ గ్రూడా ఎనిమిది వేల కోట్లతో సోలార్, పంప్డ్ స్టోరేజ్, ఎలక్ట్రిక్ వెహికల్ రంగాల్లో కీలక పాత్ర పోషించనుంది.ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో జీఎంఆర్ గ్రూప్ పదిహారు వేల కోట్లు పెట్టుబడి పెట్టగా, అపోలో మైక్రో సిస్టమ్స్ వెయ్యి ఐదు వందల కోట్లతో ఎలక్ట్రానిక్స్, ఏవియానిక్స్ తయారీలోకి అడుగుపెడుతోంది. రెన్యూసిస్, మిడ్‌వెస్ట్, అక్షత్ గ్రీన్ టెక్ వంటి సంస్థలు ఏడు వేల కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ రంగంలోకి దూసుకొస్తున్నాయి. స్టార్టప్‌లకు సిడ్బీ వెయ్యి కోట్లు, వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఇన్నోవేషన్ హబ్‌కు మరో వెయ్యి కోట్లు కేటాయించడం యువతకు భరోసా కల్పిస్తోంది.
స్టీల్, సిమెంట్, టెక్స్‌టైల్ రంగాల్లోనూ భారీ ప్రకటనలు వెలువడ్డాయి. కృష్ణా పవర్ యుటిలిటీస్ ఐదు వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్, అల్ట్రాటెక్, రెయిన్ సిమెంట్స్ రెండు వేల కోట్లతో సిమెంట్ ఉత్పత్తి విస్తరణ, సీతారాం స్పిన్నర్స్ మూడు వేల కోట్లతో టెక్స్‌టైల్ యూనిట్, ఫిల్టర్స్ పవర్ లూమ్ టెక్నికల్ యూనిట్‌కు తొమ్మిది వందల అరవై కోట్ల పెట్టుబడులు ప్రకటించాయి. ఈ ఒప్పందాలన్నీ రానున్న ఐదేళ్లలో లక్షలాది ఉద్యోగాలు సృష్టించి తెలంగాణను పారిశ్రామిక శక్తికేంద్రంగా మార్చే అవకాశం ఉంది.
9490520108.. వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి