ఐ.ఎస్.బి @ కామన్ మెన్ సర్వీస్
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ( ఐఎస్ బి)....ఇక్కడి విద్యను అభ్యసించడం భారత్ లో చాలా మందికి అందని ద్రాక్ష పండు. ఎందుకంటే పరిమిత సంఖ్యలో విద్యార్థులను చేర్చుకుంటారు. అది కూడా వివిధ పరీక్షల్లో మెరట్ సాధించిన తరువాతనే. ఫీజులు కూడా ఎక్కువే. సామాన్యుడికి అందుబాటులో ఉండవు. ఇక్కడి విద్యార్థులకు ఇచ్చే శిక్షణ అమూల్యం కావడంతో చాలా మంది మేనేజి మెంట్ కోర్సులు చదవాలనుకునే వారు ఇక్కడ సీటు సంపాదించడం కోసం తహతహలాడుతారు. ఇక్కడ విద్యార్థులందరూ పెద్ద పెద్ద ప్యాకేజీలతో ఉద్యోగాలలో చేరుతారు. చదువు పూర్తి కాక ముందే క్యాంపస్ ఎంపికల్లో వీరు కొలువుల్లో నియమితులవుతారు. దీంతో ఈ బిజినేస్ స్కూల్ యువతరానికి ఒక క్రేజ్. అంతే కాదు, వివిధ ఉద్యోగాలలో ఉండే వారు కూడా ఎక్కవ నైపుణ్యాలను సంపాదించుకునేందుకు ఇక్కడి కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి కనబరుస్తారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన విద్యావిధానం పుణ్యమా అని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తన పాఠాలను సామాన్యులకు అందించ నుంది. వివిధ రాష్ట్రాలు ఐఎస్.బి తో ఒప్పందాలు చేసుకునేందుకు అసక్తి చూపుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లోని వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ దిశగా తొలి అడుగులు వేసింది. ఆ రాష్ట్ర పరిశ్రమల మంత్రి మోకపాటి గౌతమ్ రెడ్డి, ఆయన మంత్రి మండలి లోని అధికార గణం ఇప్పటికే ఐఎస్ బితో పలు దఫాలు చర్చలు జరిపారు.
పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గతంలో ఉత్తర్వులు విడుదలచేశారు. అయినా చాలా కంపెనీలు స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ఇష్టపడటం లేదు. దీనికి కారణం స్థానికులకు నైపుణ్యం లేక పోవడమే. దీనిని గ్రహించిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం స్థానిక యవతలో నైపుణ్యాలు పెంపొందించేందుకు సంకల్పించింది. ఇందులో భాగంగా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది. స్థానికులకు అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇండియన్ స్కూల్ ఆప్ బిజినెస్ తో చర్చలు జరిపింది. ఆవి ఫలప్రదం కావడంతో ఆ సంస్థతో యం.ఓ.యు కుదుర్చుకుంది. ఏపి ప్రభుత్వం ఆధీనంలో నడుస్తున్న రెండు సంస్థలు ఆంధ్ర ప్రదేశ్ ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ, ఆంధ్ర ప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ లు సంయుక్తంగా ఇండియన్ స్కూల్ ఆప్ బిజినెస్ తో కలసి పనిచేస్తాయి.