
అలాగే ఎండిన ద్రాక్షలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి, వీటిని తినడం వల్ల రక్తహీనత సమస్య పరిష్కారమవుతుంది. రోగనిరోధక శక్తి పెంచడంలోనూ కిస్‌మిస్ ఉపయోగపడుతుంది. జీర్ణశక్తి సమస్యలతో బాధపడేవారికి ఎండుద్రాక్ష మంచి పరిష్కారం. ఎండుద్రాక్షలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఇన్ఫెక్షన్లతో పోరాడుతాయి. కిస్‌మిస్‌లో పొటాషియం, కాపర్, మెగ్నీషియం ఉంటాయి. ఇవి పొట్టలో యాసిడ్ లెవెల్స్‌ను కంట్రోల్ చేస్తాయి. అందువల్ల అసిడిటీ లాంటి సమస్యలు తగ్గుతాయి. కాన్సర్ కణాల వృద్ధి, పుండ్ల పెరుగుదల వంటి వాటిని కూడా ఇవి అడ్డుకుంటాయి. ఇక కిస్‌మిస్‌లో ఫైబర్ ఎక్కువ. ఇవి మలబద్ధకాన్ని నివారించి, తిన్న ఆహారం బాగా జీర్ణమయ్యేలా చేస్తాయి.
అలాగే ప్రతిరోజు క్రమం తప్పకుండా కిస్‌మిస్ తినడం వల్ల దంత సమస్యలు, చిగుళ్ల వ్యాధులు తగ్గుతాయి. కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. అదేవిధంగా, కిస్‌మిస్ తినడం వల్ల మెదడుకీ మేలు చేస్తాయి. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత బాగా పెరుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. కిస్‌మిస్ లో విటమిన్ సీ, సెలెనియం, జింక్ వంటివి ఉంటాయి. ఇవి చర్మాన్ని కాపాడి యాంటీ ఏజింగ్ లా పని చేస్తాయి. ఎండుద్రాక్ష తినడం వల్ల సంతాన సాఫల్యత మెరుగుపడుతుందని నిపుణులు అంటున్నారు. అయితే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కదా అని ఎండిన ద్రాక్షను మరీ ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే వీటిలో తీపి, కేలరీలు ఎక్కువ. అతిగా తింటే బరువు పెరుగుతారు.