
అతిసార వ్యాధితో బాధపడుతున్న వాళ్లకి మారేడు పండ్లు మంచి మందుగా పని చేస్తాయి.ఆయుర్వేదంలో మారేడు వేరును ఉపయోగిస్తారు.
మారేడు ఆకుల రసం మధుమేహం ఉన్నవాళ్లు తీసుకోవడం వల్ల మధుమేహం కంట్రోల్ లో ఉంటుంది.
బిల్వ ఆకులు రసం తీసి కొంచెం తేనె కలిపి తాగడం వల్ల జ్వరము తగ్గుతుంది.
కడుపులో గాని, పేగుల్లో గాని పుండుతో తోబాధపడుతుంటే బిల్వ ఆకుల రసం తీసుకోవడం వల్ల పుండ్లు నయమవుతాయి.
మలేరియాను కూడా తగ్గించే గుణం బిల్వం ఆకు లకు,ఫలాలకు ఉంది.
రక్త సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వాళ్లు విలువ ఫలం రసం తీసి అందులోకి కొంచెం అల్లం రసం కలిపి తాగడం వల్ల ఈ సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.
మారేడు ఆకులు, బెరడు ముద్దగా నూరి గాయాల మీద రాయడం వల్ల గాయాలు తొందరగా మానిపోతాయి.క్రిమి కీటకాలకు విరుగుడుగా పనిచేస్తుంది.
బాగా పండిన పండులోని గుజ్జు తీసుకోవడం వల్ల దీర్ఘకాలికంగా ఉన్న మలబద్దక సమస్య తగ్గిపోతుంది.
సగం పండిన మారేడు పండ్లు తినడం వల్ల జిగురు విరేచనాలు తగ్గిపోతాయి.
హై పవర్ ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవాళ్లు మారేడు ఆకులతో కషాయం చేసుకుని తాగడం వల్ల ఈ సమస్యలు తగ్గుతాయి.