ఆరోగ్యంగా ఉండటానికి మంచి పోషకాలున్న ఆహారం తీసుకోవడం మంచిది. అంతేకాకుండా ప్రతి ఇల్లు కూడా ఉండాలి. ఇలాంటివి తీసుకున్నా కూడా ఒక్కోసారి అనారోగ్యం అవుతుంది.  ఇలాంటి సమయంలో కొన్ని ఆరోగ్య చిట్కాలు ఉపయోగించడం వల్ల ఉపశమనం పొందవచ్చు. చిట్కాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం...

 4 లేదా 5 బాదంపప్పులను తీసుకొని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం వాటిని తినడం వల్ల మెదడు వికాసం పొందుతుంది.

 నిద్రలేమితో బాధపడుతున్న వాళ్లు తులసి రసాన్ని పంచదారతో కలిపి రోజు పడుకోబోయే ముందు తాగడం వల్ల నిద్ర బాగా పడుతుంది. అంతేకాకుండా ఒక గ్లాసు వేడి పాలలో తేనె కలుపుకొని తాగడం వల్ల కూడా మంచి నిద్ర వస్తుంది.

 నిమ్మరసంలో కొద్దిగా జీలకర్రను వేసి వరుసగా ఏడు రోజులు తాగడం వల్ల పైత్యం తగ్గుతుంది అలాగే మెంతులను నీటిలో  వేసి కషాయం చేసుకుని తాగితే వల్ల కడుపులో మంట తగ్గుతుంది.

 కడుపులో నులిపురుగుల బాధ ఉంటే ఒక టీ స్పూన్ వాము, ఒక టీస్పూన్  ఆముదము కలిపి రోజుకు రెండు సార్లు తాగడం వల్ల నులిపురుగుల బాధ తగ్గుతుంది.

 పంటి నొప్పితో బాధపడుతున్నప్పుడు కొద్దిగా లవంగం నూనె తీసుకొని ఉన్నచోట రాయడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.

 పలుచగా తయారుచేసిన చింతపండు రసంలో చిటికెడు ఉప్పు వేసి బాగా మరగనివ్వాలి. ఆ నీటిని నోట్లో  పోసుకుని పుక్కిలించడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది.

 లవంగం పొడి కి కొంచెం ఉప్పు, ఒక టేబుల్ స్పూను తేనె కలిపి తీసుకుంటే వాంతులు తగ్గుతాయి.

 లావుగా ఉన్నవారు సన్నగా కావాలంటే లేత మునగాకు రసాన్ని తాగడం వల్ల సన్నబడతారు

 వెన్ను నొప్పితో బాధపడుతున్నప్పుడు అల్లం పేస్ట్ ను తీసుకొని ఉన్న చోట మర్దన చేయాలి. ఇలా చేయడం వల్ల  వెన్ను నొప్పి తగ్గుతుంది.

 విరేచనాలు అవుతున్నప్పుడు మెంతిపొడిని కప్పు నీటిలో కలిపి ఉదయం తాగడం వల్ల విరేచనాలు తగ్గుతాయి

మరింత సమాచారం తెలుసుకోండి: