ఎండాకాలంలో చెమట కాయలు చాలా వేదిస్తూ ఉంటాయి.కొంతమందికి అయితే ఈ సమస్య తగ్గకుండా చాలా తీవ్రంగా వేధిస్తుంది. ఇక అలా చెమట కాయల సమస్యతో సతమతమయ్యేవారు సింపుల్ గా ఈ టిప్స్ ని పాటించండి. ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది.ఈ ఎండాకాలంలో చర్మాన్ని ఎప్పుడూ కూడా అసలు తడిగా ఉంచకండి. స్నానం చేసిన వెంటనే టవల్ తో అద్దుకోండి, అప్పుడే బ్యాక్టీరియా వ్యాప్తి జరగకుండా ఉంటుంది.చర్మాన్ని బాగా తుడుచుకున్న తరువాత చెమట కాయల పౌడర్ వేసుకుని చర్మం చల్లగా ఉండేలా చూసుకోండి.


ఇక తినే ఆహారం విషయంలో కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి.ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల ఎండాకాలం వేడిని తగ్గించుకోగలరు. సలాడ్స్, తాజా పండ్లు, జ్యూస్ లు, మజ్జిగ వంటి లిక్విడ్ ఆహార పదార్ధాలను ఎక్కువగా తీసుకోండి. వేపుళ్ళు, పచ్చళ్ళు అస్సలు ముట్టుకోవద్దు.స్వీట్స్ వీలున్నంత వరకు తగ్గించేయండి. అలాగే, శరీరంలో వేడిని పెంచే మసాలాల వాడకం కూడా తగ్గించండి. అలాగే స్పైసి ఫుడ్, నాన్ వెజ్ ని కూడా తగ్గించండి.


ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉండండి.కూల్ డ్రింక్స్ తాగకండి. ఆల్కహల్ కూడా ముట్టుకోవద్దు.వాటికి బదులు చల్లని పండ్ల రసాలు తాగండి.బాడీని తప్పనిసరిగా హైడ్రెటెడ్ గా ఉంచుకోవాలి.తేలికగా, వదులుగా ఉండే బట్టలు లేత రంగుల్లో ఉన్నవి వేసుకోవాలి. అప్పుడే ఎయిర్ సర్క్యులేషన్ ఉండి బాడీ కూల్ గా ఉంటుంది. సింథటిక్ బట్టలు, టైట్ గా ఉండే బట్టలు పూర్తిగా పక్కన పెట్టేసి కాటన్ బట్టలు వేసుకోండి. కాంటన్ మెటీరియల్ లో నుండి గాలీ ఫ్రీగా తిరగగలుగుతుంది.టైట్ బట్టలు వేసుకోకుండా కొంచెం లూజ్ గా ఉండే బట్టలు వేసుకోండి. ఇంకా జీన్స్ అస్సలు వేసుకోవద్దు. ఎక్కువగా నైట్ పాంట్స్, టీ షర్ట్స్ వేసుకోండి.ఇక ఈ పద్ధతులు పాటించండి. ఖచ్చితంగా చెమట కాయలు తగ్గిపోతాయి.అలాగే మీ బాడీ కూడా చాలా కూల్ గా ఉంటుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: