ఇక మన భారతదేశం అంటే వ్యవసాయ ఆధారిత దేశం. మన దేశంలో ఎక్కువగా వరి ఇంకా గోధుమ పండిస్తారు. ఇందులో చాలామంది కూడా అన్నం ఆహారంగా తీసుకుంటారు. ముఖ్యంగా మన దక్షిణ భారతీయులు దీన్ని ఆహారంగా తీసుకుంటారు. ఇక బియ్యం ద్వారా అన్నాన్ని వండటం జరుగుతుంది. ఇందులో చాలా ఎక్కువ మొత్తంలో కార్బోహైడ్రేట్స్‌ అనేవి ఉంటాయి.ఇక ఇవి శరీరానికి కావల్సిన శక్తిని బాగా అందిస్తాయి. అయితే అన్నం వండుకోవడం చాలా సులభమైన పద్ధతి అని చెప్పాలి.కానీ బియ్యాన్ని సరైన పద్దతిలో ఉడికించకపోతే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.అంతేగాక ఇది మన శరీరానికి కూడా అంత మంచిదికాదంటున్నారు. ఇక అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఇక ఈ రోజులో మనం తినే ఆహారాలు ఎక్కువగా అనేక రసాయనాలతో నిండి ఉంటున్నాయని అందరికి తెలుసు. మన జీవనశైలిలో మనకు తెలియకుండానే ఈ హానికరమైన రసాయనాలను మనం తీసుకుంటున్నాం. అయితే ఫ్యూచర్ లో ఇది చాలా ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఇంగ్లాండ్‌లోని క్వీన్స్ యూనివర్శిటీ బెల్‌ఫాస్ట్ ఈమధ్య నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే.. కీటకాల నుంచి పొలంలో పండే వరిని కాపాడటం కోసం ఇంకా ఎక్కువ దిగుబడుల కోసం రైతులు విపరీతమైన రసాయనిక ఎరువులు అలాగే పురుగుమందులను కూడా బాగా ఉపయోగిస్తున్నారు. ఇక ఈ రసాయనాలు వరిపై తీవ్ర ప్రభావాన్ని చూపడం జరుగుతుందట. ఈ ఎఫెక్ట్ వరితో తయారయ్యే బియ్యంపై కూడా ఎక్కువగా పడుతుందట. అందువల్ల ఎక్కువగా ఉడకకుండా తింటే క్యాన్సర్ బారిన పడి చనిపోయే ప్రమాదం ఉందట.కాబట్టి అన్నాన్ని బాగా వుడికించి తినటం ఆరోగ్యానికి చాలా మంచిది.ఇక అంతేకాక ఉత్తమమైన మార్గం ఏంటంటే అన్నం వండటానికి ముందు ఖచ్చితంగా రాత్రిపూట బియ్యాన్ని నీటిలో నానబెట్టడం చాలా మంచిదట. ఇక దీని కారణంగా బియ్యంలో ఉండే టాక్సిన్స్ అనేవి 80 శాతం తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు తెలిపడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: