క‌రోనా మ‌హ‌మ్మారి అంద‌రికీ క‌ష్ట‌కాల‌మే తెచ్చిపెడుతోంది. మ‌రొక వైపు ప్ర‌జ‌ల‌ను భ‌య‌బ్రాంతుల‌కు గురి చేస్తోంది. తాజాగా తెలంగాణ డీహెచ్ శ్రీ‌నివాస్‌రావుకు క‌రోనా పాజిటివ్ సోకిన‌ది. డైరెక్ట‌రేట్ ఆఫ్ హెల్త్ డిపార్టుమెంట్ కోవిడ్ బారిన ప‌డ‌డంతో క‌ల‌క‌ల‌మే రేకెత్తిస్తోంది. రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ఎప్పుడూ అల‌ర్ట్ చేసే డీహెచ్ క‌రోనా బారిన ప‌డ‌టంతో కాస్త‌ ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది. శ్రీ‌నివాస్‌రావుకు స్వ‌ల్ప ల‌క్ష‌ణాలుండ‌టంతో కోవిడ్ టెస్ట్ చేయించుకోగా.. ఇవాళ‌ పాజిటివ్ అని నిర్థార‌ణ అయింది.

ముఖ్యంగా తెలంగాణ‌లో క‌రోనా కేసులు పెరుగుతుండ‌టంతో వైద్యాధికారుల‌తో పాటు డీహెచ్ కూడా ప‌లు ఆసుప‌త్రుల‌లో ప‌ర్య‌టించారు. ఇప్ప‌టికే ప‌లువురు వైద్య సిబ్బందికి క‌రోనా బారిన ప‌డి చికిత్స పొందుతున్నారు. ఈ త‌రుణంలోనే డీహెచ్ కు క‌రోనా సోకిన‌ట్టు తెలుస్తున్న‌ది. ఈమ‌ధ్య‌కాలంలో త‌న‌ను ఎవ‌రైతే క‌లిసారో వారు వెంట‌నే క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని డీహెచ్ శ్రీ‌నివాస‌రావు సూచించారు. ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, ప్ర‌తి ఒక్క‌రూ కొవిడ్ నిబంధ‌న‌ల‌ను పాటించాల‌ని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క‌రోనా ఉధృతి కొన‌సాగుతున్న‌ది.ఇక హైద‌రాబాద్ న‌గ‌రంలోనైతే క‌రోనా కేసులు పెరుగుద‌ల‌పై ఆందోళ‌న వ్య‌క్తం అవుతుంది. కూక‌ట్‌ప‌ల్లి, బాలాన‌గ‌ర్‌ల‌లో రోజు రోజుకు కేసులు విప‌రీతంగా పెరుగుతున్నాయి. కోవిడ్ కేసులు, యూపీహెచ్‌సీ, పీహెచ్‌సీల‌లో 286 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. కూక‌ట్‌ప‌ల్లి-10, హ‌స్మ‌త్‌పేట 20, బాలాన‌గ‌ర్ 51, మూసాపేట 34, జ‌గ‌ద్గిరిగుట్ట 55, ఎల్ల‌మ్మ‌బండ 46 ప‌ర్వ‌త్‌న‌గ‌ర్‌లో 30 కేసులు నిర్థార‌ణ అయ్యాయి. అదేవిధంగా రాజ‌న్న సిరిసిల్ల జిల్లా వేముల వాడ ఇవాళ 12 కేసులు కొత్త‌గా న‌మోదు అయ్యాయి. అందులో ఆల‌యంలో ప‌ని చేసే ఇద్ద‌రు హోంగార్డుల‌కు క‌రోనా పాజిటివ్ సోకడంతో ఆందోళ‌న‌కు కార‌ణ‌మ‌వుతోంది. మ‌రొక వైపు తెలంగాణ‌లో ప‌రిస్థితి ఇలాగే కొన‌సాగితే లాక్‌డౌన్ త‌ప్ప‌ద‌నే అభిప్రాయాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు క‌రోనా సోక‌కుండా ముందు జాగ్ర‌త్త‌లు సూచించే డీహెచ్‌కు క‌రోనా పాజిటివ్ రావ‌డంతో ప్ర‌జ‌లు కాస్త ఆందోళ‌న చెందుతున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: