ఇక ఈ కలియుగంలో ఎక్కువ కాలం బ్రతకడం అనేది అసాధ్యం గా మారింది. కనీసం బయటకు వచ్చి నాలుగు అడుగులు వేయాలన్నా బైక్‌ తీసే పరిస్థితులు వచ్చాయి. ప్రతీ వస్తువు కూడా ఆన్‌లైన్‌ షాపింగ్‌లో ఇంటికే వస్తుండడంతో కనీసం షాపింగ్‌ కోసం బయటకు వెళ్లే వారు కూడా ఇప్పుడు తగ్గిపోతున్నారు.ఇప్పుడు తీసుకున్న ఆహారానికి తగ్గ శారీరకశ్రమ లేకపోవడం దాదాపు ఉద్యోగాలన్నీ కూడా కూర్చొని చేసేవి కావడంతో అనారోగ్యం బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ చాలా ఎక్కువగా పెరిగిపోతోంది.ఇలా వేధిస్తోన్న సమస్యల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పక్షవాతం ఒకటి. యంగ్ ఏంజ్‌లో ఉన్నప్పుడు సరైన శారీరక శ్రమ అనేది అసలు లేకపోవడంతో వయసు పెరిగిన తర్వాత ఇలాంటి వ్యాధులు అనేవి ఎక్కువగా వస్తున్నాయి. అయితే మీరు భవిష్యత్తులో పక్షవాతం బారిన పడకూడదంటే వెంటనే నడక ప్రారంభించాలని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. కెనడాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్‌ కాల్గేనీ పరిశోధకులు పలువురిపై రీసర్చ్‌ చేసిన తర్వాత ఈ ఉపయోగకరమైన విషయాలను వెల్లడించడం జరిగింది.

రోజులో కనీసం ముప్పై నిమిషాలు పాటు నడవడం వల్ల పక్షవాత ప్రమాదం సగానికి సగం తగ్గుతుందని వీరు చేసిన ఈ పరిశోధనల్లో తేలింది.ఇక 54 శాతం మంది కూడా పక్షపాత రోగుల్లో నడక అనేది ప్రాణాపాయాన్నీ నివారిస్తుందటా. అలాగే వారానికి కనీసం మూడు గంటలు పాటు నడిచే మహిళల్లో 43 శాతం మంది పక్షవాత ప్రమాదం నుంచి పూర్తిగా బయటపడతారని వీరు చేసిన ఈ పరిశోధనల్లో వెల్లడైంది. చూశారుగా నడక అనేది మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో. మరెందుకు ఆలస్యం వెంటనే బైక్‌లను పక్కన పట్టి వెంటనే నడకను ప్రారంభించండి.పక్ష వాతం సమస్య నుంచి వెంటనే బయట పడండి. రోజు ఇలా క్రమం తప్పకుండా నడవటం వలన పక్షవాతమే కాదు ఇక ఎలాంటి రోగాల బారిన పడే అవకాశం అనేదే లేదు.కాబట్టి రోజు కూడా ఖచ్చితంగా ఒక గంట సేపైన నడవండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోని సంపూర్ణ ఆరోగ్యంగా జీవించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: