ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా చేతిలో మొబైల్ మాత్రం ఉండాల్సిందే. పక్కనే స్నేహితులు ఉన్నప్పటికీ వారిని పట్టించుకోకుండా మొబైల్లో ఎక్కడో సోషల్ మీడియాలో ఉన్న స్నేహితుల తో మాట్లాడటానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అంతలా మనిషి అవసరాలను తీర్చేందుకు అందుబాటులోకి వచ్చిన మొబైల్ మనుషులనే బానిస గా మార్చుకుంది. ఇటీవలి కాలంలో సరికొత్త టెక్నాలజీతో వస్తున్న మొబైల్స్ అన్ని రకాల అవసరాలు తీరుస్తూ ఉండడంతో ఇక ఇక చేతిలో మొబైల్ ఉంటే చాలు ఎవరితో పనిలేకుండా పోయింది.
అయితే మొబైల్ ఎక్కువగా వాడితే ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఉదయం లేవగానే ఎంతో మంది మొబైల్ చూస్తూ ఉంటారు. అయితే దీని వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లైటింగ్ నేరుగా కళ్ళపై పడుతుండడంతో ఇక తల బరువుగా మారుతుంది. ఏ విషయాన్ని కూడా సరిగ్గా ఆలోచించలేరని నిపుణులు అంటున్నారు. ఏకాగ్రత తగ్గుతుందని ఇక తలనొప్పి సమస్య మొదలవుతుందని అంటున్నారు నిపుణులు. అంతే కాదు మొబైల్ లైటింగ్ వల్ల ఒత్తిడి పెరిగి రక్తపోటు సమస్య కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. చిన్న విషయానికే చిరాకు పడటం కోపం పనిపై ఏకాగ్రత కోల్పోవడం కూడా జరుగుతుంటాయట.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి