అయితే ఇప్పటి వరకు కూడా టీలలో అల్లం, పుదీనా ఇంకా అలాగే నిమ్మకాయ ప్లేవర్ తో తయారు చేస్తారనే విషయం అందరికీ తెలుసు. కానీ, ఇప్పుడు టీలో మరో వెరైటీ ఆరోగ్యానికి చాలా మంచిదైన వెల్లుల్లి టీ గురించి మనం తెలుసుకుందాం. ఇక ఈ టీ వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు అనేవి ఉన్నాయి. వెల్లుల్లి టీ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను ఈజీగా నియంత్రించవచ్చు. వీటితో పాటు వెల్లుల్లి టీ వల్ల మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా మనకు ఉన్నాయి.ఇక ఈ టీ వల్ల కలిగే ఆ ఆరోగ్య ప్రయోజనాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..
వెల్లుల్లి టీ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..
1. ఇక మధుమేహ వ్యాధితో బాధ పడే వ్యాధిగ్రస్తులకు గార్లిక్ టీ చాలా మేలు చేస్తుంది. దీని ద్వారా శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ అనేవి బాగా తగ్గుతాయి. ఇది జీవక్రియలో కూడా ఎంతగానో సహాయపడుతుంది.
2. అలాగే ఈ వెల్లుల్లి టీ శరీరంలోని చెడు పదార్థాలను కూడా చాలా ఈజీగా తొలగిస్తుంది.
3. గార్లిక్ టీని రెగ్యులర్ గా తాగడం వల్ల శరీర బరువును ఈజీగా నియంత్రించుకోవచ్చు. శరీరంలోని అనేక భాగాల్లో కొవ్వును కరిగించడంలో ఈ టీ ఎంతగానో సహాయపడుతుంది.
4. అలాగే ఈ గార్లిక్ టీ ని రెగ్యులర్ గా తాగడం వల్ల గుండె చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఇక దీని వల్ల రక్త ప్రసరణ అనేది కూడా మెరుగు అవుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా ఈజీగా తగ్గుతాయి. గుండె జబ్బులను కూడా ఈజీగా నివారించవచ్చు.
5.ఇక ఈ గార్లిక్ టీ శ్వాసకోశ వ్యాధుల నుండి కూడా మంచి రక్షణని ఇస్తుంది. చలికాలంలో కూడా దీన్ని తాగితే జ్వరం ఇంకా అలాగే దగ్గు సమస్యలు ఈజీగా తగ్గుతాయి.
6. ఇక ఈ టీ ఒక శక్తివంతమైన యాంటీబయాటిక్ డ్రింక్ అనే చెప్పాలి. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా బాగా పెంచుతుంది.
7.అలాగే ఈ గార్లిక్ టీ కడుపులో మంటను కూడా ఈజీగా తగ్గిస్తుంది.
ఇక ఈ హెల్తీ వెల్లుల్లి టీ ని ఎలా తయారు చేయాలి?
వెల్లుల్లి టీ ఎలా తయారు చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక పాత్రలో ఒక కప్పు నీటిని బాగా మరిగించాలి. కొద్దిసేపు తర్వాత, తరిగిన వెల్లుల్లి దానిలో కలపాలి. దీనితో పాటే ఒక చెంచా నల్ల మిరియాలు వేసి, ఈ టీని ఒక ఐదు నిమిషాలు పాటు ఉడకనివ్వండి. ఐదు నిమిషాల తర్వాత గ్యాస్ స్టవ్ ని ఆఫ్ చేసి ఆ తరువాత టీని గిన్నెలోకి వడకట్టాలి.ఇక మీ శరీరానికి మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందించే గార్లిక్ టీ రెడీ అయినట్లే..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి