చాలా మంది కూడా అధిక బరువు సమస్యతో ఎన్నో రకాలుగా బాధ పడుతూ వుంటారు. అధిక బరువుని తగ్గేందుకు  చాలా మంది కూడా చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. డాక్టర్స్ ని కలిసి ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఇంకా అలాగే వ్యాయమాలు చేయడం ఇంకా రకరకాల డైట్ ని ఫాలో అవ్వడం చేస్తుంటారు. కానీ మనం రోజూ చేసే చిన్న చిన్న పొరపాట్లే మీ పొట్ట చుట్టూ కొవ్వు రావడానికి పెద్ద కారణమవుతుంది. ఇక ఆ పొరపాట్లు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందామా..డిన్నర్‌ సరైన సమయానికి అంటే 7 నుంచి 9 గంటల మధ్య ఆహారం తీసుకోకపోతే అలాగే రాత్రిపూట ఆలస్యమైనా కూడా అది స్థూలకాయానికి పెద్ద కారణం అవుతుంది. అలాగే తినడానికి ఇంకా నిద్రించడానికి మధ్య కనీసం మూడు గంటల గ్యాప్ అనేది ఉండాలి. ఇక ఒబేసిటీ సొసైటీ జర్నల్ ప్రకారం, రాత్రిపూట కేలరీలను బర్న్ చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది.


సోషల్ మీడియా వచ్చాక అందులో ఎక్కువ సమయం గడుపుతూ ఫోన్ స్క్రీన్ మీద స్క్రోలింగ్ చేస్తూ అరగంట నుంచి గంట గడిచేటప్పటికి ఆ సమయం మీకు తెలియకపోవచ్చు కానీ దాని ప్రభావం పొట్టపై పేరుకుపోయిన కొవ్వు రూపంలో ఉంటుంది. రాత్రి పొద్దుపోయే దాకా బెడ్‌పై పడుకుని ఫోన్‌ని వాడినప్పుడు ఆ ఫోన్‌లోని బ్లూ లైట్ నిద్రకు ఆటంకం కలిగిస్తుందని చాలా అధ్యయనాలు కూడా రుజువు చేశాయి. నిద్ర లేకపోవడం వల్ల, జీవక్రియ బాగా మందగిస్తుంది. ఇది భవిష్యత్తులో ఊబకాయం ఇంకా అలాగే పొట్ట కొవ్వును పెంచుతుంది.మీరు టీవీ లేదా మొబైల్ ఫోన్ చూస్తున్నప్పుడు స్నాక్స్, చిప్స్ తింటే ఖచ్చితంగా బరువు పెరుగుతారు.టీవీ, ల్యాప్‌టాప్ లేదా ఫోన్ స్క్రీన్ ని చూస్తున్నప్పుడు, స్క్రీన్‌పై ఎక్కువ శ్రద్ధ అనేది ఉంటుంది. ఇక మీకు ఆకలిగా లేనప్పుడు కూడా ఇవన్నీ తింటే  ఇది కడుపులో కొవ్వును నిల్వ చేస్తుంది. కాబట్టి ఈ అలవాట్లు గనుక ఉంటే వెంటనే వీటిని మానుకోండి. లేదంటే ఖచ్చితంగా అధిక బరువు పెరుగుతారు. అనేక రకాల అనారోగ్యాల బారిన పడతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: