
నిజమే టెక్నాలజీ పెరిగిపోవడం కారణంగా కొన్ని అనర్ధాలు కూడా జరుగుతున్నాయి. కానీ అంతకు మించిన ప్రయోజనాలను కూడా మనిషి పొందగలుగుతున్నాడు అని చెప్పాడు. ముఖ్యంగా నేటి రోజుల్లో టెక్నాలజీకి అనుగుణంగా వచ్చిన స్మార్ట్ వాచ్లు ఎంతో మంది ప్రాణాలను నిలబెడుతున్నాయ్ అని చెప్పాలి. ఇక బ్రిటన్ లో కూడా ఇలాంటిదే జరిగింది. ఆడమ్ క్రొఫ్ట్ అనే వ్యక్తి స్మార్ట్ వాచ్ కారణంగా ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. 36 ఏళ్ల వయసులో ఉన్న ఆయన హృదయ సంబంధిత అస్వస్థతకు గురి అయ్యారు.
అయితే ఈ విషయం మాత్రం ఆయనకు తెలియలేదు. కానీ ఆయన పెట్టుకున్న ఆపిల్ స్మార్ట్ వాచ్ మాత్రం ఆయనను హెచ్చరిస్తూనే వచ్చింది. చివరికి ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకుంటే అసలు విషయం బయటపడింది. దీంతో ఇక చికిత్స తీసుకొని ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. తన ఆపిల్ గడియారంలోని ఈ ఫీచర్ ని ఉపయోగించుకుంటానని తను ఎన్నడు అనుకోలేదు. ఓ రోజు సాయంత్రం సోఫా నుంచి లేచాను. అప్పుడు కళ్ళు తిరిగినట్లుగా అనిపించింది. కొంచెం మంచి నీళ్లు తాగుదామని వంట గదిలోకి వెళ్తే అప్పుడు ప్రపంచం తలకిందులు అయినట్లు అనిపించింది. అయితే అంతకుముందు తన గడియారం ప్రతి రెండు గంటలకు ఒకసారి హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేసుకొని వెంటనే ఆసుపత్రికి వెళ్తే అట్రియల్ ఫిబ్రిలేషన్ ఉందని చెప్పి డాక్టర్లు చికిత్స చేశారు. దీంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాను అంటూ చెప్పుకొచ్చాడు సదరు వ్యక్తి.