ఈ మధ్య కాలంలో విద్యార్థుల నుంచి ఉద్యోగుల దాకా అందరిలో చాలా ఎక్కువగా కనిపించే లక్షణాలు ఏంటంటే అవే మితిమీరిన ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం ఇంకా నిరంతర పని భారం. ఈ రకమైన అలవాట్లు లేదా లక్షణాలు అనేవి మన ఆరోగ్యానికి తీరని హానిని కలిగించడమే కాక మానసిక ఇంకా అలాగే జ్ఞాపకశక్తిని కూడా బాగా బలహీనపరుస్తాయి.అందుకే జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి, ఇంకా దానికి మూలమైన ఒత్తిడిని జయించేందుకు చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. అందుకు కొన్ని రకాల చికిత్సలను కూడా తీసుకుంటారు. కానీ నిజానికి వాటిని అధిగమించాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ఇంకా అలాగే పని మధ్య విరామం తీసుకోవడం వంటివి చేయాలి. ఇంకా శరీరానికి అవసరమైన కొన్ని రకాల పోషకాలతో కూడా సమతుల్య ఆహారాన్ని కూడా తీసుకోవాలి. ఇటువంటి పోషకాహారాన్ని రెగ్యులర్ గా తీసుకుంటే మతిమరుపు, ఒత్తిడి ఇంకా ఇతర ఆరోగ్య సమస్యలను సులభంగా అధిగమించవచ్చు. ఇక మీరు తీసుకోవలసిన ఆహారాలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..


కెరోటినాయిడ్స్ చాలా పుష్కలంగా ఉండే క్యారెట్, మొలకలు, చిలగడదుంపలు, బచ్చలికూర, పాలకూర, ఎర్ర మిరియాలు, టొమాటోలు ఇంకా అలాగే నారింజ వంటి పండ్లను మీరు మీ ఆహారంలో చేర్చుకోని తినాలి.ఇక వీటితో మతిమరుపుకు చెక్ పెట్టడమే కాక మీ శరీరానికి అవసరమైన పోషకాలను కూడా ఈజీగా అందించవచ్చు.ఇంకా అలాగే మీరు మీ ఆహారంలో ఉల్లిపాయ, క్యాబేజీ, బ్రోకలీ, కాలీఫ్లవర్, టర్నిప్ వంటివాటిని చేర్చుకోని తినాలి. ఇంకా ఇవే కాకుండా మీరు నారింజ పండ్లు, మిరపకాయలు, బీన్ మొలకలు కూడా తినాలి.ఇంకా అలాగే గుడ్డు సొనలు, బాదం, నువ్వులు, సోయాబీన్స్, తృణధాన్యాలు, గోధుమలు  మీలోని మతిమరుపు ఇంకా ఒత్తిడిని నివారించడంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తాయి.ఇంకా అలాగే విటమిన్ బి 12 పుష్కలంగా ఉండే ఆహారాలు కూడా ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి. విటమిన్ B12 చాలా ఎక్కువగా ఉండే ఆహారాలలో పాలు, చికెన్, గుడ్లు, చేపలు ఉంటాయి.కాబట్టి వీటిని ఎక్కువగా తినండి.

మరింత సమాచారం తెలుసుకోండి: