రాత్రి ,పగలు అని తేడా లేకుండా గాఢ నిద్రలో ఉన్న సమయంలో చాలా మందికి ఎక్కువగా గురక విపరీతంగా వస్తూ ఉంటుంది.. దీని కారణంగా చాలా మంది మధ్యలోనే మెలకువ వస్తూ ఉంటుంది.అయితే తరచూ ఇలా జరిగితే చాలా అనారోగ్య సమస్యలకు సంకేతమని పలువురు ఆరోగ్య నిపుణులు సైతం తెలియజేస్తున్నారు.. ప్రతిరోజు కూడా గురక పెట్టే వారిలో ఆరోగ్యం త్వరగా క్షిణిస్తుందని తెలుపుతున్నారు. ఇలా గురక సమస్యతో ఇబ్బంది పడేవారు వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా మంచిదట.


గురక కారణంగా చాలా మందిలో శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఒక అధ్యయనంలో తెలియజేసినట్లు వైద్యులు తెలుపుతున్నారు. దీనివల్ల ప్రాణానికే చాలా ప్రమాదం ఉండబోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి లక్షణాలు వచ్చే ముందు పలు రకాల జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సైతం తెలుపుతున్నారు.


1). నిద్రపోతున్న సమయంలో గట్టిగా ఊపిరి పీల్చుకోవడం వంటివి గురక లక్షణం..

2). తరచూ తొందరగా అలసిపోయినట్టుగా అనిపించడం కూడా గురక లక్షణమే నట. కొంతమందిలో ఉదయం లేవగానే తలనొప్పి కూడా వచ్చే అవకాశం ఉంటుంది.


3). చాలామంది ఎక్కువ సేపు నిద్రపోవడం వల్ల కూడా గురక లక్షణమే నట.. అలాగే మానసిక ప్రశాంతత లేకపోవడం కూడా గురక లక్షణాలకు దారితీస్తుంది.


4). మానసిక ఒత్తిడి జ్ఞాపకశక్తి తగ్గిపోవడం కూడా గురక లక్షణమే.


అయితే గురక రావడానికి ప్రధాన లక్షణాల లో అధిక బరువు పెరగడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు రావడమే కాకుండా గురకవచ్చే అవకాశం ఉన్నాయని వైద్యులు తెలుపుతున్నారు.


ఎక్కువగా మద్యపానం చేయించే వాళ్ళు అనేక అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అధిక ఆల్కహాల్ తీసుకునే వారికి గురక సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందట.


ఇక 60 నుంచి 70 సంవత్సరాలు కలిగిన వ్యక్తులకు కూడా ఇలాంటి గురక సమస్య బారిన పడే అవకాశం ఉంటుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: