మనం ప్రతిరోజు వార్తా పత్రికలను అనేక రకాల వాటికి ఉపయోగిస్తూ ఉన్నారు.. ముఖ్యంగా మనం ఏదైనా హోటల్ లేదా బయట వడలు, పునుగులు ,బొరుగులు వంటివి తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా వాటిని ప్యాక్ చేసి ఇస్తూ ఉంటారు. అయితే ఇలాంటి న్యూస్ పేపర్లో చుట్టినవి తినడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు వెలుబడుతున్నాయని ఆహార భద్రత మండలి FSSAI కీలకమైన హెచ్చరికలు జారీ చేస్తోంది. ఆహార పదార్థాలను ప్యాకింగ్ వినియోగించవద్దంటూ కూడా వ్యాపారస్తులను కూడా హెచ్చరించడం జరుగుతోంది.


ఇలా న్యూస్ పేపర్ లో బ్యాగ్ చేసిన వాటిని తినడం వల్ల చాలా ఆరోగ్యానికి హానికరంగా మారుతున్నాయని తెలుపు తున్నారు. రాబోయే రోజుల్లో కఠినమైన నిబంధనలు కూడా రాబోతున్నాయని ఆహార నియంత్రణ రాష్ట్రాల మండలకి సైతం హెచ్చరిస్తోంది FSSAI సంస్థ. అయితే వార్తా పత్రికలలో వినియోగించే ఇంక్ ఎన్నో బయో యాక్టింగ్ మెటీరియల్స్ గా ఉన్నాయట.. ఈ ఇంకులో సీసం, రసాయనాలు లోహాలు కూడా ఉన్నాయని తెలియజేశారు.. వీటివల్ల మనకు ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయట. ఇవి ఆహారాన్ని కూడా కలుషితం చేస్తాయని హెచ్చరిస్తున్నారు

అంతేకాకుండా ఇలా పేపర్లో చుట్టిన వాటికి బ్యాక్టీరియా వైరస్ లు లేదా ఇతర సూక్ష్మజీవులు నిల్వ ఉంటాయని తెలియజేస్తున్నారు. ఆహారం ద్వారా వచ్చే అనారోగ్యాలను మనమే తెచ్చుకుంటున్నామంటూ FSSAI సమస్త తెలియజేస్తోంది. అంతే కాకుండా మనం ఇంట్లో కూడా ఏవైనా చేసేటప్పుడు నూనె నుంచి దేవేసి డైరెక్టుగా న్యూస్ పేపర్ మీద వేయడం వల్ల కూడా చాలా ప్రమాదం అంటూ తెలుపుతున్నారు. ఆహార పదార్థాలలో నూనె అధికంగా ఉన్నప్పుడు వాటిని వార్తాపత్రికల సహాయంతో తొలగించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఇలాంటివి చేయడం కూడా రాబోయే రోజుల్లో చట్టం నిషేధిస్తుంది అంటూ ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అనుమతించిన ప్యాకింగ్ మెటీరియల్ లోనే ఆహార పదార్థాలను సైతం వినియోగించుకోవాలంటే తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: