ఎన్నో ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న వాటిలో గోంధ్ కటోరా కూడా ఒకటి. ఈ గోంధ్ కటోరాలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.దీనిని తీసుకోవడం వల్ల శరీరంలో వేడి ఈజీగా తగ్గుతుంది. గర్భిణీ స్త్రీలు ఇంకా బాలింతలు కూడా దీనిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మూత్రంలో మంటను తగ్గించడంలో, మూత్రపిండాల్లో రాళ్ల సమస్యను తగ్గించడంలో, ఎముకలను ధృడంగా ఉంచడంలో, చర్మం  ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇలా చాలా రకాలుగా గోంధ్ కటిరా మనకు దోహదపడుతుంది. ఈ కటిరాతో మనం రుచికరమైన పాయసాన్ని కూడా తయారు చేసుకోవచ్చు. అయితే దీనిని తయారు చేసుకోవడానికి మాత్రం నీటిలో వేస్తే జెల్ లాగా మారే కటిరాను మాత్రమే తీసుకోవాలి.ఇక రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని అందించే ఈ కటోరా పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలి..ఇంకా దాని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. వంటి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.


కటోరా పాయసం తయారీ విధానం ఎలాగంటే..ఫస్ట్ కటోరాను శుభ్రంగా కడిగి నీటిని ఎక్కువగా పోసి రాత్రంతా నానబెట్టాలి. ఇక ఇలా నానబెట్టడం వల్ల కటోరా జెల్ లాగా మారుతుంది. ఆ తరువాత సగ్గుబియ్యాన్ని కూడా శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి. ఇలా నానబెట్టిన తరువాత మరుసటి రోజూ నానబెట్టిన సగ్గుబియ్యాన్ని నానబెట్టిన నీటితో సహా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తరువాత తగినన్ని నీళ్లు పోసి సగ్గుబియ్యాన్ని పూర్తిగా ఉడికించాలి. ఆ సగ్గుబియ్యం ఉడికిన తరువాత పాలు పోసి కలపాలి. వీటిని ఒక 3 నిమిషాల పాటు ఉడికించిన తరువాత కుంకుమ పువ్వు, పటిక బెల్లం పొడి వేసి కలపాలి.


తరువాత దీనిని 4 నిమిషాల పాటు ఉడికించిన తరువాత యాలకుల పొడి వేసి కలపాలి. అలాగే దీనిని మరో 5 నిమిషాల పాటు ఉడికించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి గిన్నెను పక్కకు ఉంచాలి. తరువాత ఇందులో వేయించిన డ్రై ఫ్రూట్స్ ను వేసి కలపాలి. ఆ తరువాత నానబెట్టిన కటిరాను వేసి 3 టేబుల్ స్పూన్స్ వేసి కలిపి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చాలా రుచిగా ఉండే కటోరా పాయసం తయారవుతుంది. దీనిని తినడం వల్ల మనం రుచితో పాటు మంచి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: