ఊబకాయం ఉంటే ప్రాణాల మీద ఆశలు వదలాల్సిందే?

ఊబకాయం సమస్య ప్రస్తుత రోజుల్లో యువతకు శాపంలాగా మారింది. కొంతమందికి అయితే ఈ సమస్య కారణంగా పెళ్లి కూడా అవ్వట్లేదు. చాలా మంది ఈ సమస్య వల్ల అనేక రోగాలతో చనిపోతున్నారు. ఎంత డబ్బున్నా కానీ ఈ సమస్యకు చికిత్స అందించలేము. ఒకవేళ చికిత్స తీసుకున్నా బ్రతుకుతామన్నా గ్యారెంటీ కూడా లేదు.అపర కుబేరుడు ముఖేష్ అంబాని కొడుకు అనంత్ అంబాని ఈ సమస్య బారిన పడి అల్లాడి పోతున్నాడంటే ఈ సమస్య ఎంత ప్రమాదమో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం మనలో చాలా మంది కూడా ఉబకాయం సమస్యతో ఎంతగానో బాధపడుతున్నారు. పిల్లల నుంచి పెద్దల దాకా ఈ సమస్య వల్ల అనేక అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఊబకాయం కారణంగా నిరాశ, ఆందోళన లాంటి లక్షణాలు ప్రభావం చూపి రోగాల బారిన పడేలా చేస్తాయి.ఊబకాయం ఊపిరితిత్తుల పనితీరును పరిమితం చేసి పరిస్థితులకు దారితీస్తుంది.


 అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా, తగినంత శ్వాస లేకపోవడం వల్ల రక్తంలో తక్కువ ఆక్సిజన్ స్థాయిలు, అధిక కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు ఏర్పడతాయి.రొమ్ము, పెద్దప్రేగు, ఎండోమెట్రియల్, మూత్రపిండాల క్యాన్సర్తో సహా కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదంతో ఊబకాయం ముడిపడి ఉంది.స్లీప్ అప్నియాకు ఊబకాయం ఒక ప్రధాన కారణం. ఇది నిద్రలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికరంగా ఉంటుంది. పగటి అలసట, గుండె సంబంధ సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది.అధిక బరువు కీళ్ళపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది ఆస్టియో ఆర్థరైటిస్ వంటి పరిస్థితులకు దారితీస్తుంది. అంతేకాదు.. నొప్పి, శారీర చలనశీలతను తగ్గిస్తుంది.టైప్ 2 డయాబెటిస్ అభివృద్ధి చెందడానికి ఊబకాయం ఒక ప్రధాన ప్రమాద కారకం. ఎందుకంటే అధిక శరీర కొవ్వు ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తుంది.అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు మరియు ఇన్సులిన్ నిరోధకత వంటి కారకాల వల్ల ఊబకాయం గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: