తులసి ఆకులు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంత కాదు.ఈ తులసి ఆకులను పసుపు పొడి వేసి మరిగించిన నీటిని తాగడం వల్ల రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. అలాగే జలుబు, గొంతు సమస్యలను తగ్గిస్తుంది.. ఉదర సమస్యలను తొలగించడంలో బేషుగ్గా పని చేస్తుంది.యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. తులసిలో శరీరంలో మంటను తగ్గించే సమ్మేళనాలు ఉన్నాయి.. నోటి దుర్వాసనను తగ్గిస్తుంది.. గొంతు ఇన్ఫెక్షన్ ల ను తగ్గిస్తుంది.రోజూ ఉదయాన్నే తులసి టీ తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. తులసి నీరు తాగడం వల్ల మలబద్ధకం, విరేచనాల సమస్యలు తగ్గుతాయి… ఏదైనా లిమిట్ గా తీసుకుంటేనే మంచి ఫలితాలు ఉంటాయి.ఈ తులసి నీటిని ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.. తేనెలో ముంచి ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే జలుబు, తుమ్ములు, దగ్గు, గొంతునొప్పి మొదలైన వాటి నుండి ఉపశమనం పొందవచ్చు.


తులసి ఆకులతో టీ తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి ఒత్తిడి తగ్గుతుంది. జీర్ణ క్రియ మెరుగుపడుతుంది.తులసి ఆకు కేవలం పూజలకు మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా రకాలుగా మేలు చేస్తుంది.. ఇది ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి ఇంకా చర్మ వ్యాధులను నివారించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.ఇంకా అలాగే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఇన్ఫెక్షన్లతో ఖచ్చితంగా పోరాడుతాయి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ దెబ్బతినకుండా శరీరాన్ని బాగా రక్షిస్తాయి.. అందుకే తులసి ఆకులని పరగడుపున తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు కలుగుతుంది.ఇలా చాలా రకాలుగా తులసి ఆకు మేలు చేస్తుంది.కాబట్టి ఖచ్చితంగా తులసి ఆకుని తీసుకోండి. ఎన్నో రకాల సమస్యల నుంచి చాలా ఈజీగా ఉపశమనం పొందవచ్చు.ఈ ఒక్క ఆకుని గనుక మీరు సరిగ్గా వినియోగించుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు మీ దరి చేరవు.

మరింత సమాచారం తెలుసుకోండి: