
మరీ ముఖ్యంగా రోజు రోజుకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎక్కువైపోతూ ఉండడం .. ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఇస్తూ ఉండడంతో చాలామంది జనాలు మొబైల్ ఫోన్స్ లేనిదే బతకలేకపోతున్నారు . మరీ ముఖ్యంగా రాత్రిపూట చాలామంది నిద్రపోకుండా మొబైల్ ఫోన్స్ పట్టుకొని షార్ట్స్ .. రీల్స్ చూస్తూ టైంపాస్ చేస్తున్నారు . ఇది రోజు రోజుకి ఒక వ్యసనంలా మారిపోతుంది . దీనివల్ల ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. అయితే ఆరోగ్య సమస్యలను పట్టించుకోకుండా కూడా కొంతమంది అదే విధంగా మొబైల్ ఫోన్స్ యూస్ చేస్తున్నారు . కొన్ని జిల్లాలలో ప్రైవేట్ , ప్రభుత్వాసుపత్రిలో జనరల్ ఫిజీషియన్లు వద్దకు రోజుకు సగటున వెయ్యి మందికి పైగా అవుట్ పేషెంట్లు వస్తుంటే .. అందులో 20% రాత్రి నిద్ర రాకుండా బాధపడుతున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అంటూ వైద్యులు చెబుతున్నారు.
ఇది శారీరిక మానసిక సమస్యలకు దారితీస్తుంది అంటూ కూడా హెచ్చరిస్తున్నారు. భీమవరానికి చెందిన భార్గవ్ రాత్రిపూట నిద్ర పట్టడం లేదు అంటూ ఏదో ఒకటి చేద్దాం అని స్వీగీలో చేరాడు . ఉద్యోగం మానేసిన రాత్రివేళ ఎంతకీ నిద్ర పట్టకపోవడంతో మానసిక ఒత్తిడికి గురై కనీసం తల్లిదండ్రులు కూడా గుర్తించలేనంత పరిస్థితి చెరిపోయారు . వైద్యుల సూచనలు లేకుండా నిద్ర మాత్రలు వాడడం కూడా అందుకు ప్రధాన కారణం అంటూ తెలిసింది . వయసుతో సంబంధం లేకుండా గ్యాడ్జెట్ వినియోగంతో చాలామంది నిద్రపోవడం లేదు అని ప్రతి పది నిమిషాలకు ఒకసారి ఫోన్ చూడడం.. నోటిఫికేషన్లు చదవడం ..నిద్రకు దూరమవుతుందని .. మొబైల్ స్క్రీన్ లైట్ మన కళ్ళను డామేజ్ చేస్తుంది అని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు .
పిల్లలు .. చదువు .. ఆదాయం గురించి ఆలోచిస్తూ ఉంటే టెన్షన్ వస్తుంది చిరాకు వస్తుంది అని .. ఆ టెన్షన్ పోగొట్టుకోవడానికి ఎంటర్టైన్మెంట్ అంటూ సామాజిక మాధ్యమాలను ఎక్కువగా వాడుతూ అలవాటు పడిపోయారు జనాభా అని ఆ కారణంగా రాత్రి పూట నిద్ర పట్టకుండా నిద్ర వస్తున్న కూడా ఆపుకొని కొంతమంది ఫోన్స్ ఎక్కువగా చూడడంతో తలనొప్పితో బాధపడుతూ రకరకాల అనారోగ్య సమస్యకు గురవుతున్నారు అని ఏలూరుకు చెందిన సూర్యనారాయణ రాజుగారు తెలిపారు . మద్యం , పొగ తాగడం కాఫీ టీలు తీసుకోవడం నిద్ర ని దూరం చేస్తుంది అని అందరికీ తెలిసిందే . అదే విధంగా మొబైల్ ఫోన్స్ ఎక్కువగా చూడడం కూడా నిద్రను తగ్గించేస్తుంది . అంతేకాదు ఎక్కువగా మొబైల్ ఫోన్ చూడడం వల్ల యువత ఏకాగ్రత జ్ఞాపకశక్తి కూడా కోల్పోతున్నారు అంటూ డిపిఎమ్ఓ , ఎస్సిడి సర్వే జిల్లా అధికారులు ధనలక్ష్మి గారు తెలిపారు . యువత అదేవిధంగా జనాలు మొబైల్ ఫోన్ ఎంత దూరం పెడితే అంత మంచిది అంటూ చెప్పుకొస్తున్నారు. ఫోన్ ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి ..అంతకి మించి వాడితే ఏదైనా అనర్థమే అంటూ చెప్పుకొస్తున్నారు. ఇకనైనా జనాలు మొబైల్ ఫోన్స్ దూరం పెట్టి ఆరోగ్యం పై కాన్సెంట్రేషన్ చేస్తే మంచిది అంటున్నారు..!!