
ఈ ట్రయల్స్ లో మెడిసిన్ టెస్ట్ పాస్ అయింది . అంటే ఇక మగవారు కూడా ఈ మాత్రలు వాడవచ్చు . మొట్టమొదట ఫేజ్ లో ఈ పిల్స్ పాస్ అయ్యాయి. దాదాపు 16 మందికి పైగా దీనిని ప్రయోగించగా సరైన విధంగా మెడిసిన్ పని చేసినట్లుగా వైద్యులు గుర్తించారు . అంతేకాదు ఈ పిల్స్ వేసుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు అన్న విషయాన్ని గమనించారు. ముఖ్యంగా హార్ట్ రేట్ పై ఫోకస్ పెట్టారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు అని తేల్చేశారు . అంటే ఇకపై మగవారు కూడా ఇలాంటి మెడిసిన్ వాడచ్చు.
ఇటీవల జర్నల్ కమ్యూనికేషన్ లో ఈ అధ్యాయానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేశారు . ట్రయల్స్ లో పాస్ అయిన ఈ పిల్స్ కి అప్రూవల్ రావడమే మిగిలి ఉంది అంటూ వాషింగ్టన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కి చెందిన డాక్టర్లు కూడా అభిప్రాయపడుతున్నారు . నిజానికి ఇప్పటివరకు మగవారికి కండోమ్స్ , వ్యాసెక్టమీ లాంటి వి తప్ప ఇంకేమి లేవు . బట్ ఫర్ ద ఫస్ట్ టైం మగవారికి కూడా బర్త్ కంట్రోల్ పిల్స్ తీసుకురాబోతున్నారు ఇప్పుడు ఈ పరిశోధనతో మరింత మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది అంటూ డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు.
సాధారణంగా ఏ మెడిసిన్ తయారు చేసేటప్పుడు అయినా అది సేపా కాదా అనేది ఆలోచిస్తారు . అయితే ఈ టాబ్లెట్స్ విషయంలో మాత్రం అన్ని సేఫ్ అని చెప్పొచ్చు. దానికి తగ్గట్టే అన్ని పరీక్షలు చేసి డాక్టర్లు పూర్తిగా నిర్ధారించుకున్నారు . కొలంబియా యూనివర్సిటీ కూడా ఈ డ్రగ్స్ తయారు చేయడంలో అవసరమైన సహాయాన్ని అందించింది . ఈ పిల్ కి YCT 529 అనే పేరు కూడా పెట్టేశారు సైంటిస్టులు . శుక్ర కణాల విడుదల కాకుండా ఈ డ్రగ్ అటుకుంటుందట . తద్వారా గర్భం దాల్చడానికి అవకాశం ఉండదు . దీని పట్ల సొసైటీలో రకరకాల భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి . కొంతమంది అంతా మంచికే అంటుంటే మరి కొంత మంది ఏంటి ఈ దరిద్రం..?? అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు..!!