
అరటి ఆకులలో పాలిపినాల్స్ అనే ఒక సహజమైన పోషకాలు ఉంటాయి. ఇది మనం తినేటటువంటి ఆహారంలో హానికరమైన బాక్టీరియాను నిరోధించేలా చేస్తాయి. ముఖ్యంగా మనం వేడి ఆహారాన్ని ఆకు మీద పడ్డప్పుడు అవి ఆహారంలో కలిసిపోయి శరీరానికి మేలు చేస్తాయి.
అరటి ఆకులు భూమిలో కుళ్ళిపోవడానికి చాలా తక్కువ సమయమే పడుతుంది. దీనివల్ల ఎరువుగా కూడా మారుతుంది. దీనివల్ల భూమి కూడా సారవంతంగా మారుతుంది.
ఏవైనా వేడివేడి వంటలు అరటి ఆకులో తినడం వల్ల వాటి పైన ఉండే సహజమైన మైనపు పొరవల్ల ఎలాంటి హానికరమైన రసాయనాలు ఉత్పత్తి అవ్వవు. ముఖ్యంగా అరటి ఆకుల భోజనం చాలా సహజ సువాసనతో లభిస్తుంది. దీనివల్ల భోజనం కూడా మరింత రుచికరంగా మారుతుందట.
అరటి ఆకులను భోజనం చేయడం అనేది జీర్ణక్రియకు చాలా ఉపయోగపడుతుంది. ఇది మన శరీరంలో ఉండే సానుకూల శక్తిని పై మంచి ప్రభావం చూపిస్తుందట. అంతేకాకుండా మనం సాధారణంగా ఉపయోగించే ప్లేట్లను మనం కడగడానికి ఎక్కువగా డిష్ వాషింగ్ సబ్బులు ఇతరత్రా వాటిని ఉపయోగిస్తాం దీనివల్ల మనకు హాని కలిగిస్తాయి. కానీ అరటి ఆకులు అలా ఉండవు.అందుకే మన పూర్వీకులు భారతీయుల సైతం ఎక్కువగా అరటి ఆకులలోనే భోజనం చేసేవారు. అలాగే ప్రతి ఇంటి దగ్గర ఒక అరటి చెట్టు ఉండేది.
చాలా మంది ప్రస్తుతం అయితే ఏదైనా దేవుళ్లకు నైవేద్యంగా పెట్టే సమయాలలో మాత్రమే వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మరి కొంతమంది ఎక్కువగా పేపర్ ప్లేట్లను ఉపయోగిస్తున్నారు.