
ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా తేనె వేయండి. కల్తీ తేనె అయితే నీటిలో త్వరగా కరిగిపోతుంది. అసలైన తేనె అయితే గ్లాసు అడుగుకు ఒక ముద్దలా చేరుతుంది. అసలు తేనెకు సాంద్రత ఎక్కువ కాబట్టి అది నీటిలో సులభంగా కలవదు. ఒక అగ్గిపుల్లను తేనెలో ముంచి, దాన్ని వెలిగించడానికి ప్రయత్నించండి. అసలైన తేనె అయితే అగ్గిపుల్ల సులభంగా వెలుగుతుంది. ఎందుకంటే తేనెలో తేమ ఉండదు. అదే కల్తీ తేనె అయితే, అందులో నీరు కలిపి ఉంటుంది కాబట్టి అగ్గిపుల్ల వెలగడం కష్టం అవుతుంది.
ఒక టిష్యూ పేపర్ లేదా బ్లోటింగ్ పేపర్ మీద కొన్ని చుక్కల తేనె వేయండి. అసలైన తేనె అయితే పేపర్ మీద వ్యాపించకుండా అలాగే ఉండిపోతుంది. కల్తీ తేనె అయితే దానిలోని తేమ కారణంగా పేపర్ మీద త్వరగా వ్యాపించి, అక్కడ తడి చేస్తుంది. కొంచెం తేనెను వేడి చేయండి. అసలైన తేనె వేడి చేస్తే కరుగుతుంది కానీ నురుగు రాదు. కల్తీ తేనె అయితే అందులో చక్కెర సిరప్ లాంటివి కలిపి ఉండటం వల్ల వేడి చేసినప్పుడు నురుగు వచ్చి, మాడిన వాసన వస్తుంది.
ఒక గ్లాసులో కొద్దిగా నీరు, వెనిగర్ వేసి అందులో ఒక చెంచా తేనె కలపండి. నురుగు వస్తే అది కల్తీ తేనె అని అర్థం. ఎందుకంటే, అందులో ఏమైనా చక్కెర కలిపినట్లైతే వెనిగర్ తో చర్య జరిపి నురుగు వస్తుంది. ఈ సాధారణ పరీక్షల ద్వారా మీరు వాడుతున్న తేనె అసలైనదా, కాదా అని సులభంగా తెలుసుకోవచ్చు. ఆరోగ్యానికి మేలు చేసే అసలైన తేనెను మాత్రమే వాడటం ద్వారా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. కల్తీ తేనెలో ఉన్న చక్కెరలు, ఇతర పదార్థాలు ఆరోగ్యానికి హానికరం. అందుకే, కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండండి,