ప్ర‌తి ఏడాదిలో ఉండే ఎన్నో తేదీల‌కు ఎన్నో విశేషాలు, వింత‌లు క‌లిగి ఉంటాయి. కాగా ఆయా తేదీల్లో ఎన్నో ర‌కాల ప్ర‌ముఖ‌మైన చ‌రిత్ర‌ల‌కు అద్దంలా నిలుస్తాయి. ఇక ఆ రోజు ఖ‌చ్చితంగా ఏదో ఒక విశేష‌మైన స‌న్నివేశం జ‌రిగి ఉంటుంది. ఇక అలాంటి డేట్ల‌ను మ‌నం గుర్తు పెట్టుకుని మ‌రీ సెల‌బ్రేట్ చేసుకోవ‌డం ఆన‌వాయితీ. అయితే చరిత్ర‌లో ఈరోజు జూన్ 18కి కూడా ఎంతో ప్రాముఖ్యం ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

♥ జననాలు ♥

✦  1942 : అమెరికాకు చెందిన ప్ర‌ముఖ సినీ విమర్శకుడు, సినీ చరిత్రకారుడు, పాత్రికేయుడు అయిన రోజెర్ ఎబెర్ట్ జ‌న్మించారు.

✦  1955: ప్రపంచంలో ఎత్తైన మహిళ (7'7 1/4" (232 సెంటిమీటర్లు) అయిన శాండీ అల్లెన్(మ.2008) ఈరోజు జ‌న్మించారు.

✦  1921: రాజకీయ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు, బీహార్, కర్ణాటక రాష్ట్రాలకు గవర్నరుగా పనిచేసిన పెండేకంటి వెంకటసుబ్బయ్య(మ.1993) జ‌న్మించారు.


♡ మరణాలు ♡


✦ 1929: పండితుడు, కవి, విమర్శకుడు, నాటకకర్త అయిన వేదము వేంకటరాయ శాస్త్రి(జ.1853) ఈరోజు మ‌ర‌ణించారు.

✦ 1936: రష్యన్ రచయిత అయిన మాక్సిం గోర్కీ(జ.1868) మ‌ర‌ణించారు.

✦ 1948: మహాత్మాగాంధీ ప్రథమ పుత్రుడు అయిన హరిలాల్ గాంధీ (జ.1888) మ‌ర‌ణించారు.

✦ 1953: స్వాతంత్ర్య సమరయోధురాలు, సత్యాగ్రహంలోనూ పాల్గొని జైలులో కఠిన కారాగార శిక్ష అనుభవించిన పాలకోడేటి శ్యామలాంబ(జ.1902) మ‌ర‌ణించారు.

✦ 1986: సాహిత్యవేత్త, పరిశోధకుడు అయిన ఖండవల్లి లక్ష్మీరంజనం(జ.1908)మ‌ర‌ణించారు.

✦ 2017: నాటక రచయిత, నటుడు, దర్శకుడు, నిర్వహకుడు, విమర్శకుడు అయిన గండవరం సుబ్బరామిరెడ్డి(జ. 1937) మ‌ర‌ణించారు.

 
✷ పండుగలు, జాతీయ దినాలు ✷

✦  ఈరోజు ఆటిస్టిక్ ప్రైడ్ డే

✦  హిందూమహాసముద్రం లోని సీ ఛెల్లెస్ దేశపు (ద్వీప సముదాయం) జాతీయ దినం ఈరోజు.

✦  ఈరోజు గోవాకు స్వాతంత్య్ర దినోత్సవం.


✷ సంఘటనలు ✷

✦  1815: వాటర్లూ యుద్ధంలో ఈరోజు నెపోలియన్ బోనపార్టె బెల్జియం లోని వాటర్లూలో చేసిన ఆఖరి యుద్ధంలో ఓడిపోయాడు. కాగా ఈ యుద్దాన్ని సెవెన్త్ కోలిషన్ యుద్దంగా వాటర్లూ యుద్ధంగా పిలుస్తారు ప్ర‌స్త‌తుం పిలుస్తున్నారు.

✦  1858: ఛార్లెస్ డార్విన్ ను జీవపరిణామం సిద్దాంతాన్ని ప్రచురించటానికి ప్రేరేపించిన వ్రాతప్రతిని తన సహచరుడైన ఆల్ ఫ్రెడ్ రస్సెల్ వాల్లేస్ నుంచి ఈరోజు ప్ర‌తిష్టాత్మ‌కంగా అందుకున్నాడు.

✦  1953: ఈరోజు ఈజిప్టు రాచరికాన్ని రద్దుచేసి చ‌రిత్ర సృష్టించింది.

✦  1908: ఫిలిప్పీన్స్ దేశపు యూనివర్సిటీ అయిన యూనివర్సిటీ ఆఫ్ ఫిలిప్పీన్స్ ని ఈరోజు స్థాపించారు అధికారులు.

✦  1923: మిచిగాన్ లోని కలమజూలో ఉన్న 'చెకర్ మోటార్స్ కార్పొరేషన్' తయారు చేసిన చెకర్ టాక్సీ లను మొట్ట మొదటి సారిగా ఈరోజు ప్రజల కోసం, రోడ్ల మీద నడపటం మొదలు పెట్టారంట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: