దేశమంతా 21 రోజులు లాక్ డౌన్ అయ్యింది. ప్రజలకు దిక్కు తోచకుండా ఉంది. అబ్బా ఇంకెన్ని రోజులు ఈ గృహ నిర్బంధం అన్న మాటలు వినిపిస్తున్నాయి. భగవంతుడా ఈ కరోనాను చంపేసేయ్.. మాకు స్వేచ్ఛ ప్రసాదించు అంటూ వేడుకుంటున్నారు. అయితే ఆ భగవంతుడు కూడా కొన్నాళ్లు లాక్ డౌన్‌ అనుభవించాడన్న సంగతి మరిచిపోతున్నారు.

 

 

అవును మరి.. ఒక్కసారి మన పురాణాలు తిరగేయండి.. అసలు శ్రీ కృష్ణ భగవానుడు పుట్టిందే లాక్‌డౌన్‌ పిరియడ్‌లో కదా. దేవకి, వసుదేవులు 8వ సంతానం కలిగే వరకు కంసుడి కొలువులో చెరసాలలో లాక్‌ డౌన్ అయ్యారు కదా. ఆ తర్వాత ప్రళయం నుంచి గోకులాన్ని కాపాడేందుకు శ్రీ కృష్ణుడు గోవర్థన గిరి ఎత్తినప్పడు ఏడు రోజుల పాటు గోకులం లాక్ డౌన్ అయిపోయింది.

 

 

మహాభారతంలో వనవాసం సమయంలో పాండవులు కుంతీ సమేతంగా లక్క ఇంట్లో లాక్ డౌన్ అయ్యారు కదా. అంతెందుకు రామాయణంలో సీతాదేవి రావణాసురుని చెరలో లాక్ డౌన్ అవ్వలేదా. ఇలా మనం పూజించే దేవుళ్ళు దేవతలకు కూడా లాక్ డౌన్ తప్పలేదు...
మనం ఎంత చెప్పండి.

 

 

అయితే ఒక్క విషయం గమనించాలి. దేవుళ్లకు కూడా లాక్ డౌన్ తర్వాత అన్నీ శుభాలే జరిగాయి. మనకూ అంతే.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: