శత్రువు ఎవరో స్పష్టంగా తెలిస్తే.. అప్పుడు యుద్ధం సులభం అవుతుంది. కానీ అస్పష్టంగా ఉన్న శత్రువుతో పోరాటం చాలా కష్టం. ముఖ్యంగా మన జీవితంలోని దగ్గరి వ్యక్తులే మన శత్రువులుగా మారితే.. అప్పుడు జీవితం నరకప్రాయం అవుతుంది. అందుకే ముందు ఇంట్లోని శత్రువులను గుర్తిస్తే సగం విజయం సాధించేసినట్టే.

 

 

అయితే ఇక్కడే ఓ అనుమానం వస్తుంది.. అసలు మన ఇంట్లో మనకు శత్రువులేంటి నాన్సెన్స్.. అన్న వాదన వినిపిస్తుంది. నిజమే.. మన ఇంట్లో మనకు శత్రువులు ఎందుకుంటారు. అసలు మనవాళ్లే మన శత్రువులు ఎలా అవుతారు.. ఇదే కదా మీ ప్రశ్న. మన శత్రువులు అంటే నేరుగా మనపై కత్తి కట్టేవారు మాత్రమే కాదు. మన విజయాలకు ప్రత్యక్షంగా లేదా.. పరోక్షంగా అడ్డుతగిలేవారని గుర్తించాలి.

 

 

ఒక్కసారి మన పురాణాల్లోకి వెళ్తే.. శ్రీరాముడిని చిన్నప్పటి నుంచి పినతల్లి కైక చాలా ప్రేమించింది. కన్న కొడుకు కంటే ఎక్కువ అనుకుంది. కానీ చెలికత్తె మంథర మాటలు ఆమెపై విష ప్రభావం చూపించాయి. చివరకు కన్న కొడుకు కంటే ఎక్కువగా ప్రేమించినా.. రాముడిని అడవులకు పంపింది. అందుకు తన వరాలను వాడుకున్నది.

 

 

ఇలాంటి మంథరలు మన ఇంట్లో ఎవరైనా ఉన్నారేమో చెక్ చేసుకోవాలి. లేదా.. పరోక్షంగా మనపై ప్రేమ కారణంగా మన విజయాలకు అడ్డుపడుతున్నవారు ఎవరైనా ఉన్నారేమో సరి చూసుకోవాలి. ముందు ఇంట్లో సమస్యలను అధిగమిస్తే అప్పుడు రచ్చ గెలవడం సులభంగా మారుతుంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: