ఉరుకుల పరుగుల జీవితంలో పడిపోయి మనం చాలా విషయాలను గమనించం. ఈ జీవితం ఒక అంతులేని పయనం అన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సుదీర్ఘ ప్రయాణంలో నిమిషాలు, గంటలు, దినాలు పరుగులు తీస్తూనే ఉండటాయి. కాల ప్రవాహం ఆగదు కదా. అందుకే ఆగదు ఓ నిమిషము నీ కోసమూ అంటాడో సినీ కవి.

 

 

మన పరిస్థితి ఎలా ఉన్నా కాలం పరుగు తీయక మానదు. అయితే నిమిషాలు , గంటలు. మాసాలు గడిచి సంవత్సరాలుగా మారుతుంటాయి. జీవితంలో అన్నీ సవ్యంగా సాగుతూ ఉన్నంతకాలం మాసాలు నిమిషాలుగా, సంవత్సరాలు గంటల గడియారంలో ముళ్లలా చాలా వేగంగా నడుస్తూఉంటాయి. ఆ వేగాన్ని మనం గుర్తించం కూడా.

 

 

అలా గుర్తించే సరికి చాలా సమయం గడిచిపోతుంది. అలాగే.. ఏదైనా సమస్య ఎదురుపడగానే సీన్ పూర్తిగా మారిపోతుంది. క్షణమొక యుగంగా గడుస్తుంది. ఈ గండం నుంచి ఎలా గట్టెక్కాలా అన్న భయం వెంటాడుతుంది. ఇక్కడ మనం గమనిస్తే.. అదే కాలం.. అదే సమయం. కానీ మన మనోస్థితి వల్ల మనం దాన్ని వేరు వేరుగా ఫీలవుతాం. ఈ మార్పును మనం గమనించాలి. కష్టసుఖాల్లో రెండింటిలోనూ ఒకే స్థాయిలో ఉండగలిగే స్థితప్రజ్ఞత సాధించాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: