తాజాగా ఓ అధ్యయనం ప్రకారం వెల్లడైన విషయం ఏమిటంటే.. ఇటీవల కాలంలో చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారు అని.. ఇక కొంతమంది పని ఒత్తిడి కారణంగా మరికొంతమంది మొబైల్ ల్యాప్టాప్ టీవీ లాంటివి తరచూ చూస్తూ ఉండడం వల్ల నిద్ర పోవడం లేదు. ఇక మరి కొంతమందికి టాబ్లెట్ వేసుకుంటే తప్ప నిద్రపట్టని పరిస్థితి ఏర్పడింది. హాయిగా నిద్ర పోవాలంటే కొన్ని పద్ధతులు పాటిస్తే నిద్ర దానంతట అదే వస్తుంది అని చెబుతున్నారు నిపుణులు. మరి ఆ పద్ధతులు ఏమిటో .. ఎలా పాటించాలో.. ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

ఇటీవల కాలంలో చాలా మంది జీవన విధానం వల్ల తీవ్రమైన ఒత్తిడికి గురి అవుతుంటారు. ఇక దీని ప్రభావం వారి ఆరోగ్యంపై పడటం వల్ల నిద్ర కూడా పెరుగుతుంది. చాలామంది నిద్ర లేకపోవడం వల్ల ఏకాగ్రత కూడా కోల్పోతున్నారని మరుసటి రోజు ఆహ్లాదకరమైన రోజున పొంద లేకపోతున్నామని కూడా వైద్యుల దగ్గర వాపోతున్నారు.. ఇక చాలా మంది రాత్రి సమయంలో మరింత అమితంగా ఆహారం తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు.. కారణం బరువు తగ్గడం అని చెబుతూ ఉంటారు.. అయితే రాత్రిపూట సరైన ఆహారం తీసుకుంటే హాయిగా నిద్ర పడుతుంది అనే విషయాన్ని గమనించాలి.

ఇక డైటింగ్ చేస్తూ రాత్రిపూట భోజనం తినడం మానేసే వారికి నిద్రలేమి సమస్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పోషకాహారాలు కలిగిన.. త్వరగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం వలన హాయిగా నిద్ర పడుతుంది. కాలానికి అనుగుణంగా ఆయా కాలాలలో దొరికే పండ్లను కడుపునిండా తినడం వల్ల హాయిగా నిద్ర పడుతుంది. అంతేకాకుండా నూనెలో వేయించిన బొరుగులను తింటే కూడా నిద్ర పడుతుందని చెబుతున్నారు నిపుణులు. రాగులు, కొర్రలు, జాన్నలతో చేసిన చిప్స్ లాంటివి తింటే పోషకాలు లభించడంతోపాటు త్వరగా జీర్ణమై పోయి హాయిగా నిద్ర పడుతుంది. ప్రతి రోజు ఎనిమిది గంటల లోపు రాత్రి సమయంలో భోజనం చేయడం.. ఒక గంట ఆగి నిద్ర పోవడం ..వ్యాయామం చేయడం.. ఎక్సర్సైజ్ చేయడం.. తగిన నీరు తాగడం లాంటివి చేయడం వల్ల హాయిగా నిద్ర పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: