ఒక గిన్నెలో ఒకటిన్నర గ్లాస్ నీళ్లను పోసి బాగా వేడి చేయాలి.ఆ తరువాత ఆ నీళ్లు వేడయ్యాక ఇందులో అర టీ స్పూన్ అవిసె గింజలను వేయాలి. అవిసె గింజల్లో మన శరీరానికి అవసరమయ్యే చాలా రకాల పోషకాలు ఉంటాయి. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో ఇంకా అలాగే శరీరంలో జీవక్రియల రేటును పెంచడంలో అవిసె గింజలు మనకు చాలా బాగా ఉపయోగపడతాయి. అవిసె గింజలను వేసిన తరువాత ఇందులో ఒక టీ స్పూన్  ధనియాలను వేయాలి.ధనియాలు కడుపు ఉబ్బరం, అజీర్తి ఇంకా అలాగే గ్యాస్ వంటి సమస్యలను తగ్గించడంలో శరీరంలో ఎక్కువగా ఉన్న నీటిని అలాగే కొవ్వును కరిగించడంలో చాలా బాగా సహాయపడతాయి.ఇక ఆ తరువాత ఈ నీటిలో కచ్చా పచ్చగా దంచిన రెండు యాలకులను వేయాలి. మానసిక ఒత్తిడిని ఇంకా అలాగే ఆందోళనను తగ్గించడంలో అలాగే బరువును తగ్గించడంలో యాలకులు చాలా బాగా ఉపయోగపడతాయి.ఈ యాలకులను ఉపయోగించడం వల్ల శరీరంలోని వ్యర్థాలు అన్నీ కూడా చాలా ఈజీగా తొలగిపోయి చిరుతిళ్లను తినాలన్న కోరిక కూడా ఈజీగా తగ్గుతుంది. తరువాత ఈ నీటిలో ఒక నిమ్మకాయను తీసుకొని దాన్ని గుండ్రటి ముక్కలుగా తరిగి వేయాలి.


శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో అధిక బరువును తగ్గించడంలో నిమ్మకాయ మనకు ఎంతగానో సహాయపడుతుంది. ఇప్పుడు ఈ నీటిని చిన్న మంటపై ఒక గ్లాస్ నీళ్లు అయ్యే దాకా బాగా మరిగించాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి ఈ నీరుని ఒక గ్లాస్ లోకి తీసుకుని గోరు వెచ్చగా అయ్యే దాకా ఉంచాలి.తరువాత దీనిలో రుచి కోసం టీ స్పూన్ తేనెను వేసి కలపాలి.అయితే షుగర్ వ్యాధి గ్రస్తులు మాత్రం దీనిలో తేనెను ఉపయోగించకపోవడమే మంచిది.ఇలా తయారు చేసుకున్న నీటిని రోజూ రెండు పూటలా  ఉదయం పరగడుపున అలాగే రాత్రి పడుకునే ముందు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇలా ఈ పానీయాన్ని తయారు చేసుకోవడానికి వాడిన పదార్థాలను పడివేయకుండా రాత్రి పూట వీటితోనే మళ్ళీ పానీయాన్ని తయారు చేసుకోవచ్చు.ఇలా తయారు చేసుకున్న పానీయాన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల కేవలం నెలరోజుల్లోనే మన శరీరంలో వచ్చిన మార్పును మనం గమనించవచ్చు. అధిక బరువుతో బాధపడే వారు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా సులభంగా ఈ సమస్య నుండి ఈజీగా బయటపడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: