సాధారణంగా ఎలాంటి ఉద్యోగం చేస్తున్న వారికి అయినా సరే ఇక వారంలో ఒకరోజు హాలిడే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక వారాంతం పనిచేసిన వారు ఒక రోజు విశ్రాంతి తీసుకునేందుకు ఇక ఇలా సెలవును ప్రకటించడం లాంటివి చేస్తూ ఉంటారు. అది ప్రైవేట్ కంపెనీ అయిన ప్రభుత్వ ఉద్యోగం అయినా సరే ఇక ఇలాంటి సెలవులు ఉంటాయి. ఇక ఇటీవల కాలంలో అయితే కొన్ని ఐటీ కంపెనీలు ఏకంగా వారంలో రెండు రోజులపాటు ఉద్యోగులకు సెలవులు ఇవ్వడం లాంటివి కూడా చూస్తూ ఉన్నాం.


 అయితే ఇలా ఏదో ఒక ఉద్యోగం చేస్తున్న వ్యక్తులకు వారాంతంలో ఒకరోజు సెలవు దొరకడం గురించి ఇప్పటివరకు విన్నాము.. చూసాము కూడా. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా పశువులకు సెలవు ఇస్తారు. అదేంటి పశువులకు సెలవు ఇవ్వడం ఏంటి అవేమైనా ఉద్యోగం చేస్తాయా.. అయినా వాటికి ఎందుకు సెలవు ఇస్తారు.. అని ఎన్నో ప్రశ్నలు మీ మనసులో తలెత్తాయి కదా.  ఇక్కడ మాత్రం నిజంగానే ఆదివారం రోజున మనుషుల్లాగానే ఆవులకు కూడా సెలవు ఇస్తూ ఉంటారట. ఇది కేవలం ఒక ప్రాంతంలో మాత్రమే అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే ఏకంగా 20 గ్రామాల్లో ఇక ఇదే జరుగుతుంది.


 ఝార్ఖండ్ లోతర్ జిల్లాలో అందరూ ఇలాంటి రూల్ పాటిస్తున్నారు. 20 గ్రామాల్లో ఆదివారం రోజు పశువులకు సెలవు ఇస్తారు. ఆ  రోజు పశువులకు పాలు కూడా తీయరు. పొలం పనులకు తీసుకువెళ్లరు. రోజంతా విశ్రాంతి ఇచ్చి మేత వేస్తారు. ఇక ఆదివారం రోజు వాటికి బదులుగా రైతులు స్వయంగా వ్యవసాయ పనులు చేసుకోవడానికి ఇష్టపడతారట. అయితే ఈ సాంప్రదాయం దాదాపు 100 ఏళ్ల నుంచి పూర్వీకుల నుంచి వస్తుంది అని అక్కడి స్థానికులు అందరూ కూడా చెబుతూ ఉన్నారు. ఈ సాంప్రదాయం గురించి తెలిసి గొప్ప ఆలోచన అని ఎంతోమంది ప్రశంసలు కురిపిస్తున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Cow