ఈ సృష్టి 
లో బలమున్నోడిదే ఆధిపత్యం. బలమున్న మనుషులే మిగతా వారిని శాసిస్తూ ఉంటారు. అయితే కేవలం మనుషుల మధ్యే కాదు అడవుల్లో జీవించే జంతువులకు కూడా ఇక ఈ మాట బాగా వర్తిస్తూ ఉంటుంది. అడవుల్లో బలం ఉన్నోడిదే ఆదిపత్యం అన్నట్లుగా ఎన్నో ఘటనలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే పులులు సింహాలు లాంటి జంతువులు తమ బలాన్ని ప్రదర్శిస్తూ ఇతర జంతువులను వేటాడి దారణంగా చంపేసి ఆహారంగా మార్చుకుంటూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే కొన్ని కొన్ని సార్లు ఏకంగా క్రూర మృగాలే ఒకదానిపై ఒకటి పై చేయి సాధించడం కూడా చూస్తూ ఉంటాం. ఇక ఇటీవల ఇలాంటి ఒక అరుదైన దృశ్యమే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఏకంగా వేటగాడే వేటకు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన ఫోటోనే ఫారెస్ట్ ఆఫీసర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది వైరల్ గా మారిపోయింది. సాధారణంగా అటు చిరుత పులి మెరుపు వేగంతో సాధు జంతువులను వేటాడుతుంది అన్న విషయం అందరికీ తెలుసు. అయితే చిరుత పులితో పోల్చి చూస్తే అటు పులికి బలం ఎక్కువగానే ఉంటుంది.


 ఈ రెండు క్రూర మృగాలు ఎదురుపడి పోట్లాడటం మాత్రం చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఇలాంటి అరుదైన దృశ్యమే తెరమీదికి  వచ్చింది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కస్వాన్ రాజస్థాన్లోని రణతంబోర్ నేషనల్ పార్క్ లో చిరుత పులిని తింటున్న పులి చిత్రాన్ని ట్విట్టర్లో షేర్ చేశాడు. చిరుత,  పులి మధ్య జరిగిన భీకరమైన పోరులో చిరుతను చంపేసిన పులి ఆ తర్వాత దాని మాంసాన్ని ఎంతో ఇష్టంగా తింటుంది. అక్కడికి వచ్చిన పర్యటకుల కొందరు ఈ ఘటన ఫోటో తీశారు. దీంతో ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: