మహిళలు నిత్యం ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా వారి ఆహారంలో కొన్ని పదార్థాలు చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.కొబ్బరి.. వాత, పిత్త దోషాలను సమతుల్యంగా ఉండేలా చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. శరీర బలాన్ని పెంచడంలో, ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో, థైరాయిడ్ పనితీరును మెరుగుపరచడంలో ఇది బాగా సహాయపడుతుందని చెబుతున్నారు. కొబ్బరి మన శరీరానికి చలువ చేస్తుంది కాబట్టి, ప్రతిరోజూ ఓ చిన్న ముక్కను తింటే చాలా మంచిదని సూచిస్తున్నారు.అలాగే నల్ల ఎండుద్రాక్షలో పొటాషియం, క్యాల్షియం ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇంకా పెళుసు బారకుండా కాపాడతాయని అంటున్నారు. ఇందులో ఉండే ఐరన్ రక్తహీనతను ఈజీగా తగ్గిస్తుంది. అలాగే ప్రేగులను శుభ్రం చేయటం, లైంగిక సామర్థ్యాన్ని పెంచటం, నెలసరి సమస్యలు పరిష్కరించడంలో ఎండుద్రాక్ష బాగా తోడ్పడుతుంది. ఇంకా వీటిలో ఐరన్‌తోపాటు విటమిన్‌ C కూడా ఉంటుంది. శరీరం ఖనిజాలను త్వరగా గ్రహించుకోవటానికి విటమిన్‌ C బాగా తోడ్పడుతుందని, పైగా దీనివల్ల వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయని చెబుతున్నారు.


నల్ల ఎండుద్రాక్షలో ఐదు వృక్ష రసాయనాలు ఇంకా ఓలియానోలిక్‌ యాసిడ్‌ వంటి యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. పైగా ఇవి పళ్లు పుచ్చిపోకుండా కాపాడుతున్నట్టు అమెరికాలో నిర్వహించిన పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే మహిళలు ఉదయాన్నే నల్ల ఎండుద్రాక్షలను తినడం వల్ల చాలా రోగాలు దూరమవుతాయి. ఇది పిత్త దోషాన్ని తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.అలాగే మన ఆహారంలో నువ్వులను తీసుకోవడం వల్ల నాడీ వ్యవస్థ నుంచి కండరాలు, ఎముకల ఆరోగ్యం దాకా అన్ని సమస్యలూ పరిష్కరమవుతాయి. ఈ నువ్వులు వాత సమస్యలను దూరం చేస్తాయి. ఇంకా నెలసరి రావడానికి 15 రోజుల ముందు ప్రతిరోజూ ఒక టీస్పూన్ వేయించిన నువ్వులు తింటే నెలసరి సమస్యలన్నీ తగ్గిపోతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.ఇక మహిళలల్లో వచ్చే రక్తహీనత సమస్యను ఖర్జూరం చాలా ఈజీగా దూరం చేస్తుంది. అలాగే అలసట, నీరసం, ఐరన్ లోపంతో బాధపడే మహిళలు, నెలసరి సమస్యలు ఉన్నవారు ప్రతిరోజూ ఖర్జూరం తినడం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: