కాయగూరలలో అధిక వాటర్ కంటెంట్ వున్న సొరకాయ ఒకటి.సాధారణంగా పూర్వం రోజుల్లో సొరకాయలను ఎండబెట్టి వాటిని బూరెల్లాగా తయారు చేసుకునేవారు. ఎందుకంటే అందులో వాటర్ నింపి తరచూ తీసుకోవడం వల్ల,వారి శరీరానికి చల్లదనాన్ని చేకూర్చేది.ఎందుకంటే శరీరానికి వేడిని తగ్గించే గుణం పుష్కలంగా ఉంటుంది కనుక.సొరకాయలో పీచు,నీటితో నిండిన కూరగాయ.ఇందులో ఐరన్,పొటాషియంతో పాటు చాలా విటమిన్‌లు కూడా ఉంటాయి.

కావున సొరకాయ జ్యుస్ రోజుకు ఒక గ్లాస్ చొప్పున తీసుకోవడం వల్ల,చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెబుతుంటారు ఆయుర్వేద నిపుణులు. అసలు సొరకాయ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో మనము తెలుసుకుందాం పదండి..

ఈ మధ్యకాలంలో చాలామంది చిన్న వయసులోనే తెల్ల జుట్టుతో బాధపడుతూ ఉంటారు.అలాంటి వారికి రోజుకో సొరకాయ గ్లాసు సొరకాయ జ్యూస్ ఇవ్వడం వల్ల ఇందులో ఉన్న బీటెక్ కెరోటిన్ మరియు విటమిన్ ఏ జుట్టు నల్లబడడానికి దోహదపడుతుంది.అంతే కాక కంటి చూపును మెరుగుపరచడంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది.

సొరకాయలో 90% వాటర్ కంటెంట్ ఉంటుంది కనుక వేసవిలో సొరకాయ చూసిన తాగడం చాలా ఉత్తమం.శరీరంలో ఉన్నదిక వేడి,ఎక్కువ చెమట పట్టడం వంటి సమస్యలను ఈజీగా తొలగిస్తుంది.

మరియు ఇందులో ఉన్న పొటాషియం మరియు ఐరన్ కంప్లైంట్ ల వల్ల రక్తహీనత తగ్గి,హిమోగ్లోబిన్ శాతం తొందరగా పెరుగుతుంది.

సొరకాయ తరచూ ఏదోక కూరల్లో కానీ,కద్దుక హల్వా కద్దుక కీర్ వంటి వాటిని రోజు తీసుకోవడం వల్ల విటమిన్ సి పుష్కలంగా అంది,రోగనిరోధక శక్తి పెరుగుతుంది.దీనితో సీజనల్ ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉండడమే కాకుండా,అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్ని కూడా దరిచేరకుండా కాపాడుకోవచ్చు.

మరియు దేహంలో వృద్ధి చెందిన విషపూరిత వ్యర్థాలను తొలగించడంలో సొరకాయ అద్భుతంగా పని చేస్తుంది. ఇందులో సహజసిద్ధంగా ఉన్న మత్తు కలిగించే గుణం వల్ల,మానసిక ఒత్తిడి తగ్గడంతో పాటు తొందరగా నిద్రపోతారు.దీనితో నిద్ర లేమి సమస్యకు చెక్ పడుతుంది.

ఇంకెందుకు ఆలస్యం ఇన్ని సుగుణాలు ఉన్న సొరకాయను మీ డైట్ లో చేర్చుకోవడమే తరువాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: