
ఎముకలలో సత్తువ కోల్పోవడం, ఇతర వ్యాధులను నివారించడానికి విటమిన్ డి మరియు క్యాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తినడం ఎంతో అవసరం. విటమిన్ డి, క్యాల్షియం అధికంగా ఉండే ఆహారాలను ఇప్పుడు చూద్దాం. సోయాతో చేసే టోఫులో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ టోఫుతో చేసిన ఆహారాలు తినడం ద్వారా కండరాలు పెరుగుతాయి. కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. సల్మాన్, ట్రౌట్ మరియు ట్యూనా వంటి కొవ్వు చాపలు విటమిన్ డి, క్యాల్షియం ఎక్కువగా కలిగి ఉంటాయి. ఇవి ఆరోగ్యంగా ఉండటమే గాక మనకు ఎన్నో పోషకాలను కూడా అందిస్తాయి.
ఇది ఎముకలను కూడా బలపరుస్తుంది. పాలు మరియు ఇతర పాల ఉత్పత్తులు నెయ్యి, జున్ను, వెన్న మొదలైనవి ఎముకలను బలంగా ఉంచడానికి సహాయపడతాయి. ముఖ్యంగా మనం పాలు తాగడం వల్ల శరీరంలోని ఎముకల స్పందత పెరుగుతుంది. శనగలు, సోయాబీన్స్, కిడ్నీ బీన్స్ వంటి చిక్కుళ్ళు జాతికి చెందిన ఆహారాల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. కండరాలు ఆరోగ్యంగా పెరగాలంటే వీటిని తప్పకుండా తీసుకోవాలి. బాదం, వాల్నట్స్, పిస్తా, గుమ్మడి, పొద్దు తిరుగుడు గింజల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి కండరాలను రిపేర్ చేస్తాయి. కండరాలు ఆరోగ్యంగా పెరిగేందుకు దోహాట్ పడతాయి. ఆకు పచ్చ కూరగాయలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో పోషక ఆహారాలు ఎక్కువగా ఉంటాయి. బ్రోకలీ, క్యాబేజీ, క్యాల్షియం, బచ్చలి కూర వంటివి ఈ కోవలేకే వస్తాయి. ఇందులో అక్సాలిక్ ఆమ్లం ఉంటుంది.