
బూడిది గుమ్మడికాయలో ఉండే సహజ శాంతికర గుణాలు మానసిక ఒత్తిడిని తగ్గించడానికి ఉపయోగపడతాయి. మనస్సు ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. ఇది మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. క్యాలరీలు తక్కువగా ఉండి, ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది బరువు తగ్గాలనుకునేవారికి మేలైన పానీయం. జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తూ, అహారాన్ని సరిగ్గా జీర్ణింపజేస్తుంది. ఈ జ్యూస్ లో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటంతో చర్మాన్ని టానీక్ లా పని చేస్తుంది. మొటిమలు, రింగు వర్మ్స్, అలర్జీలు వంటి చర్మ సమస్యలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. బూడిద గుమ్మడికాయ రక్తంలో షుగర్ స్థాయిని నియంత్రణలో ఉంచడంలో సహాయపడుతుంది.
గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల డయాబెటిస్ ఉన్నవారు కూడా దీన్ని తాగొచ్చ. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. నిత్య విరేచనానికి సహకరిస్తుంది. ఇది ఆహారనాళాన్ని శుభ్రంగా ఉంచుతుంది. బూడిద గుమ్మడికాయ జ్యూస్ మలినాలను తొలగించి మూత్రనాళాన్ని శుభ్రంగా ఉంచుతుంది. ఇది మూత్ర విసర్జనను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వేసవికాలంలో బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగితే శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. హీట్ బాడీ ఉన్నవారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. బీపీ నియంత్రణలో ఉంచుతూ గుండె పటిష్టంగా ఉండేలా చేస్తుంది. ఇందులో పోటాషియం ఉండటం వల్ల హై బీపీ ఉన్నవారికి మేలు చేస్తుంది. బూడిద గుమ్మడికాయను తొక్కతీసి ముక్కలుగా కట్ చేసి జ్యూసర్‌లో వేసి గ్రైండ్ చేయాలి. కొంచెం నీరు కలిపి వడకట్టుకుని తాగాలి. ఖాళీ కడుపుతో ఉదయం తాగితే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. తేనె లేదా పుదీనా కొద్దిగా కలిపినా మంచిదే.