
గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ముఖ్యంగా శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో సహాయపడతాయి. ఇది కేన్సర్ వంటి గంభీర వ్యాధుల నుంచి రక్షణ ఇస్తుంది. గ్రీన్ టీ నిత్యం తాగడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ (LDL) స్థాయిని తగ్గిస్తుంది. ఇది రక్త నాళాల కండిషన్ మెరుగుపరచి గుండెపోటు, హై బీపీ, స్రోక్ వంటి సమస్యల అవకాశాలను తగ్గిస్తుంది. గ్రీన్ టీ రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రణలో ఉంచడంలో సహాయపడుతుంది. ఇది టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి బాగా ఉపయోగపడుతుంది. ఈ టీలో ఉండే యాంటీబ్యాక్టీరియల్ గుణాలు నోటిలో బ్యాక్టీరియాను తగ్గిస్తాయి. దాంతో పళ్ల కుళ్ళిపోవడం, నోటి దుర్వాసన, ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.
వేసవికాలంలో గ్రీన్ టీని లైట్‌గా తాగితే శరీరంలోని అధిక ఉష్ణోగ్రతను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. ఇది శరీరానికి తేలికగా ఫీల్ అయ్యేలా చేస్తుంది. అనే పదార్థం శరీరాన్ని రిలాక్స్ చేయడంతో పాటు మానసిక శాంతిని కలిగిస్తుంది. పని ఒత్తిడిలో ఉన్నవారు, చదువులు చదివే విద్యార్థులు తాగితే మంచి ఫలితాలు ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు చర్మ కణాలను రక్షిస్తూ వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తాయి. మొటిమలు, ముడతలు తగ్గించి నిగారింపునిచ్చే చర్మానికి సహాయపడుతుంది. గ్రీన్ టీ ఫేస్ ప్యాక్‌లా కూడా వాడవచ్చు. అతిగా తిన్న తర్వాత గ్రీన్ టీ తాగితే జీర్ణం త్వరగా అవుతుంది. ఇది గ్యాస్, అపచారం వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో కాదు, బ్రేక్‌ఫాస్ట్ తర్వాత తాగాలి. మధ్యాహ్నం తిన్నాక తాగవచ్చు. రాత్రి పడుకునే ముందు తాగకూడదు, నిద్రకు ఆటంకం కలగవచ్చు.