
కొన్ని లిపిడ్ వంటి మందులు వాడే వారికి దానిమ్మ రసాన్ని వాడితే ఔషధ క్రియాశీలత మారిపోవచ్చు. దానిమ్మలోని ఎంజైములు మెడిసిన్ల మీద ప్రభావం చూపి, అవి దుష్ఫలితాలివ్వచ్చు. గుండెకు సంబంధించిన సర్జరీకి 2 వారాల ముందు దానిమ్మను పూర్తిగా ఆపడం మంచిది. ఎందుకంటే ఇది రక్తాన్ని పలుచగా చేసి, ఆపరేషన్ సమయంలో రక్తస్రావం మితిమీరే ప్రమాదం ఉంది. దానిమ్మ పండు తిన్న వెంటనే కొందరికి మలబద్ధకం లేదా విరేచనాలు రావచ్చు. ముఖ్యంగా దానిమ్మ గింజలు కాస్త కఠినంగా ఉండి జీర్ణ వ్యవస్థను ఒత్తిడిలోకి తీసుకురాగలవు.
ఇది ఉన్నవారికి హానికరం. దానిమ్మ రక్త ప్రవాహాన్ని మెరుగుపరచే గుణం కలిగి ఉంది. కానీ ఇది ప్లేట్లెట్ల కౌంట్ తక్కువగా ఉన్నవారికి ప్రమాదకరంగా మారవచ్చు. ఇది రక్తం గడ్డకట్టే ప్రక్రియను ఆలస్యం చేస్తుంది. కొందరు ఆస్థమా, గుండెకు సంబంధించిన మందులు వాడుతున్నవారు దానిమ్మ తీసుకుంటే మందులు పనిచేయకుండా పోయే అవకాశాలు ఉంటాయి. ఫలితంగా మందుల ప్రభావం తగ్గిపోవచ్చు. గర్భిణీలు, ఈ పండు తినే ముందు డాక్టర్‌ను సంప్రదించాలి. రక్తాన్ని పలుచబెట్టే మందులు వాడే వారు దీనిని పూర్తిగా నివారించాలి. ఏదైనా మందులు వాడుతున్నప్పుడు, దానిమ్మ తీసుకోవడం ద్వారా దుష్ప్రభావం వస్తుందేమో డాక్టర్ ఆమోదంతోనే తినాలి.