
అంతేకాకుండా ఆషాడ శుద్ధ ఏకాదశి నాడు శ్రీ మహా విష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశించి ఆ తర్వాత సుమారు నాలుగు నెలల పాటు అదే స్థితిలో ఉంటాడట . ఆ కారణంగానే ఈ మాసంలో ఏ మంచి పనిని కూడా చేయరు . మన ఇంట్లోని పెద్ద వాళ్లు కూదా అదే చెబుతారు. ఒకవేళ చేస్తే శ్రీవారి అనుగ్రహం ఉండదు అనేది నమ్మకం. మరి ముఖ్యంగా ఈ మాసంలోనే నూతన వధూవరులు దూరంగా ఉంచడం లాంటివి చేస్తూ ఉంటారు పెద్దవాళ్ళు . ఎట్టి పరిస్ధితిలోను ఆషాడ మాసంలో కొత్తగా పెళ్ళైన్ వాళ్లని దగ్గరగా ఉండనివ్వరు.
కాగా ఆడవాళ్లు ఆషాడ మాసంలో కొన్ని కొన్ని పనులు అస్సలు చేయకూడదు అంటూ చెపుతున్నారు పండితులు. మరీ ముఖ్యంగా తాళిబొట్టులోని సూత్రాలు మార్చుకోవడం.. అదేవిధంగా జుట్టు కత్తిరించుకోవడం ..మరి ముఖ్యంగా కాళ్లు మెట్టెలు మార్చుకోవడం లాంటి పనులు అసలు చేయకూడదట . అది అపశకునంగా మారిపోతాయట . ఏదైనా సరే మంచి శుభకార్యాలు ఆషాడ మాసంలో అసలు చేయకూడదు అంటున్నారు పెద్దవాళ్ళు. మరీ ముఖ్యంగా కొంతమంది ఆడవాళ్లు ఆషాడమాసంలో ఎక్కువగా తెలిసి తెలియక మెట్టెలు మార్చుకుంటూ ఉంటారు ..అలా చేయనే చేయకూడదట . తాళిబొట్టుని ఎట్టి పరిస్థితులోను కూడా తీయకూడదట. అలా చేస్తే మహా మహా పాపం అంటున్నారు పండితులు..!!