
ముఖ్యంగా బరస్ట్ క్యాన్సర్, కాలన్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ విషయంలో ఇవి సహాయపడతాయని పరిశోధనలు చెబుతున్నాయి. ద్రాక్షలో విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు చర్మానికి తళతళలాడే ప్రకాశాన్ని ఇస్తాయి.ముడతలు, వయస్సు మచ్చలు, మొటిమలు తగ్గుతాయి. శరీరాన్ని లోపలినుండి శుభ్రపరచి చర్మం బయట మెరిపిస్తుంది. గ్రేప్స్‌లో ఉండే ల్యూటిన్ , జియాజాంటిన్ అనే పదార్థాలు కళ్ళను UV రేడియేషన్ నుండి రక్షిస్తాయి. మాక్యులర్ డిజెనరేషన్ పెద్ద వయస్సులో వచ్చే కంటి సమస్య నివారించవచ్చు. రెస్వరట్రాల్ మెదడు కణాల మధ్య సంకేతాలను మెరుగుపరుస్తుంది. స్ట్రెస్ తగ్గించి మూడ్‌ను నియంత్రిస్తుంది. చిన్న పిల్లల జ్ఞాపకశక్తిని పెంచడానికి ఇది సహజ బ్రెయిన్ టానిక్. ద్రాక్షలో ఉన్న ఫైబర్ & నీరు జీర్ణవ్యవస్థను చక్కగా పనిచేసేలా చేస్తాయి. ఇది సహజ ల్యాక్సేటివ్‌లా పనిచేసి మలాన్ని సాఫీగా బయటకు పంపిస్తుంది. మలబద్ధకం ఉన్నవారికి ఇది రోజువారీ ఆహారంగా చక్కటి ఎంపిక. పొటాషియం పుష్కలంగా ఉండటం వలన ఇది రక్తనాళాలను విశ్రాంతి పరచుతుంది.
సోడియం ప్రభావాన్ని తగ్గించి బిపిని నియంత్రణలో ఉంచుతుంది. హై బిపి ఉన్నవారు రోజూ కొన్ని ద్రాక్షలు తినొచ్చు. విటమిన్ C, బి6, కే, యాంటీఆక్సిడెంట్లు కలగలసి శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వైరల్, బ్యాక్టీరియల్ సంక్రమణలకు వ్యతిరేకంగా శక్తివంతంగా పనిచేస్తుంది. ద్రాక్షలో ఉన్న ఫ్లావనాయిడ్లు వీర్య కౌంట్, క్వాలిటీ మెరుగుపరుస్తాయి. లైంగిక ఆరోగ్యానికి సహజ టానిక్ లా పనిచేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు మితంగా మాత్రమే తినాలి. వేపిన లేక డ్రై గ్రేప్స్ (మునక్కా/కిష్మిశ్) ఎక్కువ తినకండి – షుగర్ అధికంగా ఉంటుంది. సీడ్స్ ఉన్న ద్రాక్షలు మెరుగైనవి – సీడ్‌లలో ఫైటోన్యూట్రియంట్లు ఎక్కువ. ఓవర్‌ఇటింగ్ చేసినప్పుడు డయేరియా,లాంటి సమస్యలు రావచ్చు.