
పోషకాలు ఎక్కువగా లభించే ఈ పండు ప్రస్తుతం హైదరాబాద్ లాంటి నగరాలలో 50 రూపాయలకే 6 కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. గత కొన్నేళ్లలో తెలుగు రాష్ట్రాల్లో సైతం ఈ పండు వినియోగం ఊహించని స్థాయిలో పెరిగింది. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో సైతం ఈ పండ్ల సాగు పెరిగి ప్రస్తుతం దిగుమతులు ఎక్కువ కావడంతో ఈ పండ్ల ధరలు ఊహించని స్థాయిలో తగ్గుతున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఎకరాకు 6 టన్నుల దిగుబడిని ఈ పంట సాగు ద్వారా పొందే అవకాశం ఉండగా పంట చేతికి వచ్చే వరకు కనీసం 5 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 2000 ఎకరాల్లో ఈ పంట సాగవుతోంది. బాట సింగారం మార్కెట్ కు ఊహించని స్థాయిలో ఈ పండ్ల దిగుమతులు పెరగగా ధరలు తగ్గడంతో రైతులకు ఊహించని స్థాయిలో నష్టాలూ వస్తున్నాయి.
గతంలో ఎప్పుడూ ఈ పండుకు ఇలాంటి పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. గతంలో ఎకరానికి కనీసం లక్ష రూపాయలు లాభం ఉండేదని ప్రస్తుతం 2 లక్షల రూపాయల నష్టం వాపోతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి పండ్లు రాకుండా కఠినతరం చేస్తే బాగుంటుందని రైతులు కోరుతున్నారు. ఇప్పటికే ఈ సమస్య వ్యవసాయ శాఖ దృష్టికి రాగా మంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. రైతులు మాత్రం ధరలు తగ్గడం విషయంలో తీవ్ర ఆందోళన చెందుతున్నారు.