మన నిత్య జీవితంలో చేతి వేళ్ళు కీలక పాత్ర పోషిస్తాయి. రాయడం నుండి వంట చేయడం వరకు, ప్రతీ పనికి వేళ్ళు అవసరం. అలాంటి ముఖ్యమైన చేతి వేళ్ళలో నొప్పి వస్తే, అది ఎంత అసౌకర్యాన్ని కలిగిస్తుందో ఊహించవచ్చు. ఈ నొప్పి తేలికపాటిది కావచ్చు లేదా తీవ్రమైనది కూడా కావచ్చు, ఇది రోజువారీ కార్యకలాపాలను కూడా కష్టతరం చేస్తుంది. చేతి వేళ్ళలో నొప్పికి అనేక కారణాలు ఉండవచ్చు, వాటిని అర్థం చేసుకోవడం సరైన చికిత్సకు ముఖ్యం.

ఆర్థరైటిస్ చేతి వేళ్ళ నొప్పికి అత్యంత సాధారణ కారణాలలో ఒకటి. రుమటాయిడ్ ఆర్థరైటిస్  ఆస్టియో ఆర్థరైటిస్ రెండూ వేళ్ళ కీళ్ళను ప్రభావితం చేస్తాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఒక ఆటోఇమ్యూన్ వ్యాధి, ఇది కీళ్ళలో వాపు, నొప్పిని కలిగిస్తుంది, ముఖ్యంగా ఉదయం పూట. ఆస్టియో ఆర్థరైటిస్ అనేది కీళ్ళ మధ్య ఉన్న మృదులాస్థి అరిగిపోవడం వల్ల వస్తుంది, ఇది నొప్పి, దృఢత్వం, వాపుకు దారితీస్తుంది.

 మణికట్టులో ఉన్న కార్పల్ టన్నెల్‌లో మధ్యస్థ నాడి ఒత్తిడికి గురైనప్పుడు కార్బల్ టన్నెల్ సిండ్రోమ్ ఏర్పడుతుంది. ఇది వేళ్ళలో తిమ్మిరి, మంట, నొప్పికి దారితీస్తుంది, ముఖ్యంగా బొటనవేలు, చూపుడు వేలు, మధ్య వేలు, సగం ఉంగరపు వేలులో నొప్పి వస్తుంది.

వేళ్ళను కదిలించడానికి సహాయపడే టెండన్స్ లో నొప్పి వస్తే టెండనైసిస్ సమస్య అని గుర్తించవచ్చు. కంప్యూటర్ వర్క్ చేసేవాళ్ళలో ఎక్కువమందిని ఈ సమస్య వేధించే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.  ట్రిగ్గర్ ఫింగర్, గ్యాంగ్లియన్ సిస్ట్ లాంటి కొన్ని కారణాలు కూడా ఈ సమస్యకు కారణమవుతాయి. చేతి వేళ్ళలో నొప్పి అనేది తీవ్రమైన సమస్య కావచ్చు, కానీ సరైన నిర్ధారణ,  చికిత్సతో, చాలా మంది ఉపశమనం పొందవచ్చు.  



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: