లవంగం భారతీయ వంటకాలలో ముఖ్యమైన మసాలా పదార్థం మాత్రమే కాకుండా, ఇది ఔషధ విలువలతో నిండిన ఒక అద్భుత ఆయుర్వేద ఔషధం. ప్రతిరోజూ చిన్న మోతాదులో లవంగాలు తినడం ద్వారా శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. లవంగాల్లో ఉండే యూజినాల్ అనే సహజ ఆయిల్ నొప్పిని తగ్గిస్తుంది. దంత నొప్పి, ఇన్ఫెక్షన్లు, నోటి దుర్వాసనలకు లవంగం చక్కటి పరిష్కారం. రోజూ ఒక లవంగం నమలడం వల్ల జింజివైటిస్త గ్గుతుంది. లవంగం తినడం వలన గ్యాస్, అజీర్ణం, కడుపు ఉబ్బరాన్ని తగ్గించవచ్చు. జీర్ణరసాల ఉత్పత్తిని ప్రోత్సహించి ఆహారాన్ని వేగంగా అరిగిస్తుంది.

భోజనం తర్వాత ఒకటి రెండు లవంగాలు నమలడం ద్వారా అరిగింపులో తక్షణ ఉపశమనం లభిస్తుంది. లవంగాల్లో ఉన్న యాంటీ సెప్టిక్, యాంటీ మైక్రోబియల్ గుణాలు శ్వాసనాళాలను శుభ్రం చేస్తాయి. దగ్గు, గలగల, గొంతు నొప్పి వంటి సమస్యలకు ఉపశమనం. లవంగం టీ లేదా తేనెతో కలిపి తినడం ద్వారా శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. లవంగాల్లో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి రక్షణగా పనిచేస్తాయి. ప్రతిరోజూ ఒకటి రెండు లవంగాలు తినడం ద్వారా జలుబు, వైరల్ ఫీవర్ లాంటి వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు. లవంగాలు మెదడు పనితీరును మెరుగుపరిచే నైరాలజికల్ బెనిఫిట్స్ కలిగి ఉంటాయి. ఒత్తిడి తగ్గించి, కేంద్రీకరణ పెంపుకు సహాయపడతాయి.

లవంగాల్లోని యూజినాల్ రక్తంలో చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. డయాబెటిస్ ఉన్నవారు వీటిని పరిమిత మోతాదులో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. లవంగాన్ని నేరుగా నమలడం లేదా పొడి చేసి గోరువెచ్చిన నీటితో తీసుకోవడం వల్ల కడుపులోని పురుగులు నశిస్తాయి. లవంగాల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడతాయి. లవంగాలు శరీరంలో వేడి కలిగించి శక్తి నింపుతాయి. అనురక్తత, అలసట వంటి సమస్యలు తగ్గుతాయి. ఒకటి లేదా రెండు లవంగాలు ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు లేదా ఉదయం ఖాళీ కడుపుతో నమలవచ్చు. లేదా లవంగా పొడిని తేనెతో కలిపి తీసుకోవచ్చు. లవంగ టీగా చేసుకుని తాగినా ప్రయోజనమే.

మరింత సమాచారం తెలుసుకోండి: