
ఇందులో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల తనం తగ్గుతుంది. పేగుల పనితీరును చక్కబెడుతుంది. ఎండు ద్రాక్షల్లో ఐరన్, కాపర్ లాంటి ఖనిజాలు మెరుగ్గా ఉంటాయి. ఇది రక్తహీనత అనీమియా నివారణలో సహాయపడుతుంది. సహజ చక్కెరల వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. వర్కౌట్స్ చేసే వారికి చాలా ఉపయోగకరం. పొటాషియం సమృద్ధిగా ఉండి బీపీ నియంత్రణలో సహాయపడుతుంది. కోలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది. క్యాల్షియం, బోరాన్ ఉండటం వల్ల ఎముకల ఆరోగ్యానికి మంచిది. యాంటీఆక్సిడెంట్స్ మెరుగ్గా ఉండటం వల్ల చర్మకాంతిని పెంచుతుంది. వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తుంది. మెమొరీ మెరుగవుతుంది. ఒత్తిడి తగ్గుతుంది.
షుగర్ ఉన్నవారు డాక్టర్ సూచన మేరకు పరిమితంగా మాత్రమే తినాలి. ఒకేసారి ఎక్కువ తింటే వాంతులు, పొట్ట ఉబ్బరం, డయేరియా వంటి సమస్యలు రావచ్చు. నానబెట్టి తినడం వల్ల అందులోని చక్కెర తక్కువ స్థాయిలో ఉంటుంది, అలాగే జీర్ణక్రియకు కూడా మేలు. రాత్రి 1/4 గ్లాస్ నీటిలో 20–30 ఎండు ద్రాక్షలు వేయండి. ఉదయం వాటిని తిన్న తరువాత, నీటిని కూడా తాగొచ్చు. ఎండు ద్రాక్షలు చిన్నవి కానీ అధిక శక్తి, పోషకాలతో నిండినవి. సరైన మోతాదులో, సరైన సమయంలో తింటే ఇది శరీరానికి, మెదడుకి, చర్మానికి, హృదయానికి ఎన్నో లాభాలు ఇస్తుంది.