మనం ప్రతిరోజు తాగేటువంటి పాల దగ్గర నుంచి కూరగాయలు, ఆహారం ఇలా అన్నిటిలో కూడా కల్తీ జరుగుతోంది. ముఖ్యంగా ఆయా పదార్థాలను పోలి ఉండేటువంటి వాటితో కలిపి వినియోగదారులను చాలా మోసం చేస్తున్నారు. దీంతో ప్రజలలో కూడా అవి శుద్ధమైనవా ?కల్తీవా అనే అనుమానాలు ఉన్నప్పటికీ కూడా వాటిని ఎలా తనిఖీ చేసుకోవాలో తెలియక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని సందర్భాలలో అనారోగ్యం పాలవుతున్నారు కూడా. తాజాగా NIN సంస్థ.. ఈ కల్తీ పై అవగాహన కల్పిస్తూ కొన్ని విషయాలు తెలియజేసింది.


పాలు:

పాలను ప్రస్తుతం ఎక్కువగా కల్తీ చేస్తున్నారు. అప్పట్లో ఎక్కువగా నీటిని కలిపేవారు కానీ ఇప్పుడు యూరియా, స్టార్చ్, డిటర్జెంట్లను కలుపుతున్నారట. ఇవి ఎదిగే పిల్లలకు చాలా ప్రమాదాలను కలిగిస్తాయి. రకరకాల బ్రాండెడ్ కలిగిన పాలు కూడా కల్తీ ఉన్నాయో లేదో ఇలా గుర్తించవచ్చు. పాల కల్తీని లాక్టోమీటర్ ద్వారా గుర్తించవచ్చు. ఇది చౌక ధరకే మనకు లభిస్తుంది.

టెస్ట్ ట్యూబ్ లోకి కొన్ని పాలను తీసుకొని అందులో లాక్టోమీటర్  ఉంచితే చాలు ఆ రీడింగ్ సాంద్రత 1.020 నుంచి 1.030 మధ్య ఉన్నట్లు అయితే ఆ పాలు కల్తీ లేనట్లు.. అంతకంటే ఎక్కువ పాలలో లాక్టోమీటర్ మునిగిందంటే నీరు ఎక్కువగా ఉన్నట్లు భావించాలి.

పాలలో యూరియా కలిపారా? లేదా?

పాలను ఒక టెస్ట్ ట్యూబ్ లో తీసుకొని అందులోకి కొద్దిగా కందిపప్పు పొడి లేకపోతే ,సోయాబీన్ పొడి వేయాలి. వాటిని బాగా కలిపిన తర్వాత లిట్మస్ పేపర్ ను అందులో ముంచి బయటకు తీయాలి. ఆ కాగితం నీలిరంగులోకి మారిందంటే అవి కల్తీ పాలుగా గుర్తించవచ్చు.


పాలలో స్టార్చ్ కలిపితే:

గాయాలైనప్పుడు ఉపయోగించే  టీంక్చర్  చుక్కలను పాలలో వేయాలి.. ఆ పాలు నీలి రంగులోమారాయంటే ఆ పాలు కల్తీ అయినట్టే.


2).టీ పొడి కల్తీ:

ఇటీవలే కొంతమంది కల్తీ టీ పొడి ముఠాను కూడా అధికారులు పట్టుకున్నారు. అయితే ఇందులో ఇనుమును కలుపుతున్నారట.. వీటిని కనుక్కోవడానికి అయస్కాంతం టీ పొడిలో ఉంచడం వల్ల అవి అతుక్కుంటాయి.


3). కల్తీ తేనె:

తేనె లో చక్కెర, బెల్లం పాకం ఎక్కువగా కలిపేస్తున్నారు. వీటిని కనుక్కోవడానికి కొంత తేనెను తీసుకొని గాజు గ్లాసులో ఉండే నీటిలోకి వేయాలి.. అది నీటిలో  కలిసిపోతే అది కల్తీదని అర్థం.. తేనె అయితే గాజు అడుగు భాగంలోకి చేరుతుంది.


4). మిరియాలు:

ఇవి ఖరీదు ఎక్కువగా ఉండడంతో వీటిలోకి బొప్పాయి గింజలు కలుపుతున్నారు.  ఇవి చూడడానికి రెండు ఒకేలా ఉన్నప్పటికీ నీటిలో వేస్తే బొప్పాయి గింజలు పైన తేలుతాయి.

5). బఠాణి గింజలు:

ఎక్కువగా పచ్చ  బఠాణీలను కూరలలో ఉపయోగిస్తుంటాం.. కానీ వీటికి రంగు వేసి మార్కెట్లో అమ్మడం వల్ల క్యాన్సర్ బారిన పడుతున్నారు.. ఈ బఠానీ గింజలను కొద్దిసేపు నీళ్లలో నానపెడితే రంగు పోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: