దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. సామాన్య ప్రజల నుండి ప్రజాప్రతినిధులు, సినీ సెలెబ్రెటీల వరకు ఎవరిని వదిలి పెట్టడం లేదు. ఇప్పటికే ఈ మహామారి కారణంగా చాల మంది ప్రాణాలను కోల్పోయారు. మరికొంత మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలు కరోనా బారినపడిన సంగతి అందరికి తెలిసిందే. గాన గంధర్వుడు.. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాతో పోరాడుతున్నారు ఆ మహమ్మారి సోకడంతో ప్రస్తుతం ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడు.


ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుపడడం లేదని ఆయన కుమారు ఎస్పీ చరణ్ వీడియో రిలీజ్ చేసి వాపోయారు. ప్రస్తుతం ఫారిన్ నుంచి డాక్టర్లను రప్పించి ఎస్పీ బాలుకు ప్రత్యేకంగా చికిత్సనందిస్తున్నారు. ప్రస్తుతం ఎస్పీ బాలు వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే నిన్న సాయంత్రం సినీ ప్రముఖులంతా ఆయన కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.


ఆంధ్రుల అభిమాన గాయకుడు, గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా వైరస్‌ బారినుంచి త్వరగా కోలుకోవాలని తెలుగు రాష్ట్రాల్లో అందరూ కోరుకుంటున్నారు. కొంతమంది దేవుళ్లకు పూజలు ప్రార్థనలు చేస్తున్నారు. తాజాగా ఎస్పీ బాలు కరోనా వైరస్ నుంచి కోలుకోవాలని వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పూజలు చేయించారు. బాల సుబ్రహ్మణ్యం దేశంలోనే గొప్ప నాయకుడని ప్రశంసించారు. ప్రపంచ ప్రసిద్ధ గాయకుడు కోలుకోవాలని ఆకాంక్షించారు. ఎస్పీ బాలు టీటీడీతో మంచి అనుబంధం ఉంది. భూమన టీటీడీ చైర్మన్ గా చేసినప్పుడు అనేక పాటలు పాడాడు.


అయితే ఎస్పీ బాలు ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని చెన్నై ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు తెలిపారు. ఇక వైద్య నిపుణుల పర్యవేక్షణలో వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నామని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. కాలేయం మినహా అన్ని అవయవాలు పనిచేస్తున్నాయని.. విదేశీ వైద్యుల సూచనలతో ఎక్మో పరికరంతో వైద్యం చేస్తున్నామన్నారు. ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ కూడా బాలు ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇక బాలు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని కన్నీళ్లు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: