ప్రస్తుతం టాలీవుడ్ లో సమంత అనే పేరు తెలియని వారంటూ ఎవరూ ఉండరు. అంతలా తన పేరును పదిలం చేసుకుంది సమంత. తన నటనతో, తన అందంతో ప్రేక్షకులను మైమరచేలా చేసింది ఈ భామ. అయితే ఈ భామ అక్కినేని అనే ఇంటి పేరును తన పేరు పక్కన తొలగించింది అంట.. ఇంతకూ ఎందుకో చూద్దాం.


టాలీవుడ్ లో నాగచైతన్య తో "ఏ మాయ చేసావే" సినిమాలో ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ సినిమాతోనే వీరిద్దరూ ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. అయితే ఈమె గురించి ఇటువంటి ఏ సంఘటన జరిగినా కూడా ఆమె సోషల్ మీడియాలో ఎక్కువగా పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఒక వైపు తన భర్తతో ఉన్నటువంటి అనుబంధాన్ని, మరోవైపు సినీ జీవితం తో ఉండే అనుబంధాన్ని రెండిటిని సమానంగా చూసుకుంటూ ముందుకు సాగిపోతోంది.

ఇక ఈమె నాగచైతన్య ని వివాహం చేసుకున్న తరువాత.."అక్కినేని సమంత గా మారిపోయింది. కానీ ఇప్పుడు అక్కినేని అనే పేరును తీసేసి అందరినీ ఆశ్చర్య పరిచేలా చేసింది. సమంత తన "ఇంస్టాగ్రామ్, ట్విట్టర్లో ఉండేటువంటి అక్కినేని అనే పేరును తీసివేసి ఆ స్థానంలో "s"అనే అక్షరాన్ని ఉంచింది. ఇలా చేయడం ద్వారా ఆమెపై అందరూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.


సమంత సడన్ గా ఇలా చేయడం ఏంటి అని అభిమానులలో ఆలోచన పడింది. దీనిపై సోషల్ మీడియాలో విపరీతంగా చర్చనీయాంశం జరుగుతోంది. ఆమె ఏదైనా స్పెషల్ గా అనిపిస్తే ఇలాంటివి చేస్తుందనీ కొందరు అనుకుంటున్నారు. మరికొంతమంది మరికొన్ని కారణాలను తెలియజేస్తున్నారు. ఆమె ఇలా అవ్వడానికి కారణం తనే వెల్లడించాల్సి ఉంటుందని , సినీ వర్గాలలో సమాచారం. ఇకపోతే సమంత తన అత్తవారింటి పేరును తీసివేయడం వెనుక ఉన్న రహస్యం ఏమిటో,  తెలియక ఆమె అభిమానులు కూడా తెగ ఆలోచిస్తున్నారు. మరి ఆమె ఈ విషయంపై ఎలా స్పందిస్తుందో అనే విషయం మనం వేచిచూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: